Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:42 AM

ఏపీ హైకోర్టులో నేడు జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా చరిత్ర సృష్టించనున్న లీసా గిల్

13-03-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైకోర్టు మొదటి కోర్టు హాలులో ఉదయం 10.15 గంటలకు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆమెతో ప్రమాణం చేయించనున్నారు.

పంజాబ్–హరియాణా ఉమ్మడి హైకోర్టు నుంచి బదిలీపై వచ్చిన జస్టిస్ లీసా గిల్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రెండో స్థానంలో కొనసాగనున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం ప్రధాన న్యాయమూర్తుల నియామకంపై కీలక విధాన నిర్ణయం తీసుకుంది. చీఫ్ జస్టిస్ పదవికి ఖాళీ ఏర్పడే రెండు నెలల ముందే సంబంధిత హైకోర్టుకు న్యాయమూర్తిని బదిలీ చేయాలని నిర్ణయించింది.

ఈ నిర్ణయం మేరకు పంజాబ్–హరియానా హైకోర్టులో మూడో స్థానంలో ఉన్న జస్టిస్ లీసా గిల్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయగా, దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తుల నియామకానికి అనుమతి ఉండగా, జస్టిస్ లీసా గిల్ చేరికతో ప్రస్తుతం జడ్జీల సంఖ్య 34కు చేరనుంది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏప్రిల్ 24న పదవీ విరమణ చేయనుండగా, అనంతరం జస్టిస్ లీసా గిల్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

దీంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె నిలవనున్నారు.

Sthanikam

ఏపీ హైకోర్టులో నేడు జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా చరిత్ర సృష్టించనున్న లీసా గిల్

Article Image

అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైకోర్టు మొదటి కోర్టు హాలులో ఉదయం 10.15 గంటలకు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆమెతో ప్రమాణం చేయించనున్నారు.

పంజాబ్–హరియాణా ఉమ్మడి హైకోర్టు నుంచి బదిలీపై వచ్చిన జస్టిస్ లీసా గిల్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రెండో స్థానంలో కొనసాగనున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం ప్రధాన న్యాయమూర్తుల నియామకంపై కీలక విధాన నిర్ణయం తీసుకుంది. చీఫ్ జస్టిస్ పదవికి ఖాళీ ఏర్పడే రెండు నెలల ముందే సంబంధిత హైకోర్టుకు న్యాయమూర్తిని బదిలీ చేయాలని నిర్ణయించింది.

ఈ నిర్ణయం మేరకు పంజాబ్–హరియానా హైకోర్టులో మూడో స్థానంలో ఉన్న జస్టిస్ లీసా గిల్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయగా, దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తుల నియామకానికి అనుమతి ఉండగా, జస్టిస్ లీసా గిల్ చేరికతో ప్రస్తుతం జడ్జీల సంఖ్య 34కు చేరనుంది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏప్రిల్ 24న పదవీ విరమణ చేయనుండగా, అనంతరం జస్టిస్ లీసా గిల్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

దీంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె నిలవనున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News