Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 10:46 AM

ఈనాటి ఈ బంధం ఏనాటిదో..!

ఈనాటి ఈ బంధం ఏనాటిదో..!

ఈనాటి ఈ బంధం ఏనాటిదో..!
18-02-2026 99 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పసిప్రాయంలో పెంచిన తల్లిని వెతుక్కొని కేరళకు చేరుకున్న సౌదీ యువకుడు

కేరళ:

పసిప్రాయంలో తనను కన్న తల్లి కన్నా మిన్నగా చూసుకుని అల్లారుముద్దుగా పెంచిన మహిళను వెతుక్కుంటూ సౌదీ అరేబియాకు చెందిన ఓ యువకుడు కేరళకు చేరుకున్నాడు. ప్రత్యేక విమానంలో భారత్‌కు వచ్చిన అతడు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ప్రేమతో పెంచిన ఆ తల్లిని కలిసి భావోద్వేగానికి గురయ్యాడు. పొట్టకూటి కోసం సంవత్సరాల క్రితం సౌదీకి వెళ్లిన కేరళకు చెందిన ఓ హిందూ మహిళ అక్కడ ఓ షేక్ ఇంటిలో పని చేసింది. ఆ ఇంట్లో ఉన్న చిన్నారి బాలుడిని ఆమె సొంత కొడుకులా చూసుకుని పెంచింది. కాలక్రమేణా ఆమె స్వగ్రామానికి తిరిగి వచ్చేసింది. అయితే చిన్ననాటి ఆ మమకారాన్ని మరువలేని ఆ బాలుడు ఇప్పుడు పెద్ద యువకుడై తన పెంపుడు తల్లిని వెతుక్కుంటూ భారత్‌కు రావడం హృదయాలను కదిలించింది. తనను కన్న తల్లి కన్నా ఎక్కువ ప్రేమ చూపించినది ఈ అమ్మేనని, ఆమె ఎంతో గొప్పమనసున్న మహిళని యువకుడు భావోద్వేగంతో తెలిపాడు. వృద్ధురాలైన ఆమె కూడా తన వద్దకు వచ్చిన యువకుడిని సొంత కొడుకులా హత్తుకుని మురిసిపోయింది. ఆ క్షణాలు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించాయి. ఆమె శేష జీవితానికి భరోసా కల్పించేలా తగు చర్యలు తీసుకుంటానని యువకుడు హామీ ఇచ్చాడు. మళ్లీ వస్తానమ్మా అంటూ ఆమెకు వీడ్కోలు పలికి సౌదీకి తిరుగు ప్రయాణం అయ్యాడు. మనుషుల మధ్య మమకారం, ప్రేమకు దేశాలు, మతాలు అడ్డుకావని ఈ సంఘటన మరోసారి చాటి చెప్పింది.

Sthanikam

ఈనాటి ఈ బంధం ఏనాటిదో..!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News