Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నూతన ఇంట్లో ఆనందాలు వెల్లివిరియాలి.. లింగాయత్ సంఘం ఆకాంక్ష దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 07:53 PM

ఎన్నికలు ఏవైనా గెలుపు కాంగ్రెస్‌దే

ఎన్నికలు ఏవైనా గెలుపు కాంగ్రెస్‌దే

ఎన్నికలు ఏవైనా గెలుపు కాంగ్రెస్‌దే
13-02-2026 87 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రెండేళ్ల పాలనపై స్పష్టమైన ప్రజాతీర్పు – రికార్డు విజయానికి ప్రజలకు కృతజ్ఞతలు

మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పందన

హైదరాబాద్: రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీదే ఘన విజయం సాధించిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల విశ్వాసం మరింత బలపడిందన్నారు.తాజా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రెండేళ్ల ఇందిరమ్మ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పు అని మంత్రి తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు, కంటోన్మెంట్ మరియు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు, పంచాయితీ ఎన్నికలు వంటి ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్ పార్టీ విజయపథంలో సాగిందని గుర్తుచేశారు.

గ్రామీణ ప్రాంతాలే కాకుండా పట్టణ ప్రజలు కూడా ప్రభుత్వ పనితీరుపై పూర్తి సంతృప్తితో ఉన్నారని మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు రెండేళ్ల ప్రభుత్వ పనితీరుకు ప్రజాభిప్రాయ సేకరణగా భావిస్తున్నామని, ముందుగానే ప్రకటించినట్లుగానే ఫలితాలు వచ్చాయని తెలిపారు.పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోవడం వారి వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రతిపక్షాల ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. ఎన్ని కుట్రలు జరిగినా ప్రజలు ఇందిరమ్మ ప్రభుత్వ పక్షాన నిలిచి ముఖ్యమంత్రి నాయకత్వాన్ని మరింత బలపరిచారని స్పష్టం చేశారు.

ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరికీ మంత్రి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రజా ప్రభుత్వంపై అపార విశ్వాసం ఉంచి రికార్డు స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం అందించిన తెలంగాణ ప్రజానీకానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో జరగబోయే ప్రతి ఎన్నికలోనూ ఇదే ప్రజాతీర్పు పునరావృతమవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

Sthanikam

ఎన్నికలు ఏవైనా గెలుపు కాంగ్రెస్‌దే

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News