Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:36 PM

ఎన్నికల నిర్వహణలో ఆర్‌.ఓలు, ఏఆర్‌.ఓల పాత్ర కీలకం : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

03-02-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు (ఆర్‌.ఓలు), సహాయ రిటర్నింగ్ అధికారులు (ఏఆర్‌.ఓలు) కీలక బాధ్యతలు నిర్వహిస్తారని, ఎన్నికల నియమ నిబంధనలపై సంపూర్ణ అవగాహనతో విధులు నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు.మంగళవారం భువనగిరి మున్సిపాలిటీలో పీఓలు, ఏపీఓలకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.ఎన్నికల ప్రక్రియలో భాగంగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో అందించే పోలింగ్ మెటీరియల్, బ్యాలెట్ బాక్సులు, ప్రిసైడింగ్ అధికారుల డైరీ, బ్యాలెట్ పేపర్ అకౌంటు నిర్వహణ, ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను తెరవడం వంటి అంశాలపై పీఓలు, ఏపీఓలు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలింగ్ మెటీరియల్‌ను ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా పరిశీలించాలని, ముఖ్యంగా బ్యాలెట్ పేపర్ల విషయంలో అత్యంత జాగ్రత్త వహించాలని సూచించారు.

ఆర్‌.ఓలు తమ బృందంలోని ఎన్నికల సిబ్బందికి ఎన్నికల నియమ నిబంధనలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని, విధుల నిర్వహణలో సమన్వయం కీలకమని తెలిపారు. అలాగే ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని టీ–పోల్ యాప్లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామలింగం, పీఓలు, ఏపీఓలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ఎన్నికల నిర్వహణలో ఆర్‌.ఓలు, ఏఆర్‌.ఓల పాత్ర కీలకం : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News