Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:29 AM

ఎన్ఎస్ఎస్ శిబిరంలో అవగాహన ర్యాలీ – సావిత్రిబాయి పూలే జయంతి

03-01-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
హైదరాబాద్ స్థానికం ప్రతినిధి

ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్ ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో పసుమాముల, కళానగర్ గ్రామాల్లో కొనసాగుతున్న శీతాకాల ప్రత్యేక శిబిరం రెండో రోజున పరిసరాల పరిశుభ్రత, చెట్ల పెంపకం, నీటి పొదుపు, రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీతో పాటు సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

శిబిరం రెండో రోజులో భాగంగా శుక్రవారం ఉదయం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పసుమాముల, కళానగర్ గ్రామ వీధుల్లో పరిసరాల పరిశుభ్రత, చెట్ల సంరక్షణ, నీటి వృథా నివారణ, రోడ్డు భద్రత వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు, నినాదాలతో గ్రామస్తులను చైతన్యపరిచారు.మధ్యాహ్నం ప్రాథమిక పాఠశాల ఆవరణలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల వైస్‌ప్రిన్సిపాల్ శ్రీమతి ఇందిరా హాజరై మాట్లాడుతూ, అప్పటి సామాజిక కట్టుబాట్లను ధైర్యంగా అధిగమించి విద్యను అభ్యసించి, పేద వర్గాలకు విద్య వెలుగులు అందించిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఆమె జీవితం విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని, ఆ ఆదర్శాలతో జీవితాలను తీర్చిదిద్దుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మహిళా సాధికారికత విభాగం కోఆర్డినేటర్ డా. అపర్ణ చతుర్వేది, కళాశాల అధ్యాపకులు ప్రొఫెసర్ నాగేంద్ర, డా. పి. రమాదేవి, డా. గీతా నాయక్, డా. కె. అనిత, ఐక్యూఏసి కోఆర్డినేటర్ డా. డి. మధు, డా. వి. శేఖర్, డా. బాల నరసింహ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డా. ఇ. యాదగిరి రెడ్డి, డా. ఎస్. శారదా దేవి తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

ఎన్ఎస్ఎస్ శిబిరంలో అవగాహన ర్యాలీ – సావిత్రిబాయి పూలే జయంతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News