Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్య వివాహాలను అరికట్టాలి.. బాలికల విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి:జిల్లా సమన్వయకర్త గడ్డం పల్లవి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 08:29 PM

ఎన్ జి కళాశాలలో రేపు జాతీయ స్థాయి తెలుగు భాషా సదస్సు

28-01-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

కాలానుగుణంగా మారుతున్న తెలుగు భాషా స్వరూపంపై రేపు నల్గొండ పట్టణం వేదిక కానుంది. నాగార్జున ప్రభుత్వ కళాశాలలో తెలుగు భాషా వికాసంపై జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నారు.కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో, ప్రాచీన తెలుగు భాషా విశిష్ట అధ్యయన కేంద్రం నెల్లూరు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ఈ నెల 30వ తేదీన “తెలుగు భాషా వికాసంలో వివిధ వైఖరులు” అనే అంశంపై ఒక రోజు పాటు ఈ సదస్సు జరగనుంది.ఈ సదస్సులో ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక మాధ్యమాల వరకు తెలుగు భాష సాగిన ప్రయాణం, భాష వినియోగంలో వచ్చిన మార్పులు, ఎదురవుతున్న సవాళ్లపై లోతైన చర్చ జరగనుంది. తెలుగు భాషా పరిణామ క్రమం, చారిత్రక దృక్పథాలు, ఆధునిక సాహిత్యంలో కొత్త ధోరణులు, మాధ్యమాల ప్రభావం, బోధనా రంగంలో తెలుగు అమలుపై పరిశోధనా పత్రాలు ప్రవేశపెట్టనున్నారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలోని కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాల నుంచి ప్రముఖ ఆచార్యులు, భాషావేత్తలు, పరిశోధకులు, అధ్యాపకులు ఈ సదస్సులో పాల్గొననున్నారు.తెలుగు భాషా పరిరక్షణకు, భవిష్యత్ వికాసానికి ఈ సదస్సు దిశానిర్దేశం చేస్తుందని కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్, సదస్సు సంచాలకులు డా. వెల్దండి శ్రీధర్ తెలిపారు. భాషాభిమానులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు.

Sthanikam

ఎన్ జి కళాశాలలో రేపు జాతీయ స్థాయి తెలుగు భాషా సదస్సు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News