Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
205 రోజులుగా ఎదురుచూపులే.. తనకు న్యాయం చేయాలని విలేకరి వేడుకోలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 10:07 PM

ఏలూరులో రాష్ట్ర స్థాయి అబాకస్ & వేదిక్ మాథ్స్ పోటీల్లో అదిరిపోయిన విజయం!

22-02-2026 598 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చిన్నంపేట సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రతిభకు రాష్ట్ర స్థాయి ప్రశంసలు

ఏలూరులో ఘనంగా నిర్వహించిన స్టేట్ లెవెల్ అబాకస్ అండ్ వేదిక్ మాథ్స్ పోటీల్లో చాట్రాయి మండలం చిన్నంపేట సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పాఠశాలకు కీర్తి తేవడం గర్వకారణంగా నిలిచింది.

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ పోటీల్లో మాణికుల భవిష్య, చీపు వర్షిని, తేళ్ళూరి శ్రేష్ట లేఖన, డొంకిన భాను తేజ, ఘంటసాల గీత సిరివల్లి, అబ్బ దాసరి లేఖన తమ అసాధారణ మేధస్సుతో ప్రతిష్టాత్మక బహుమతులు సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. కఠినమైన ప్రశ్నలకు వేగంగా, ఖచ్చితంగా సమాధానాలు ఇచ్చి తమ ప్రతిభను చాటారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్ పలగాని శ్రీనివాసరావు మాట్లాడుతూ,

“మన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మెరిసి విజేతలుగా నిలవడం ఎంతో గర్వంగా ఉంది. గణితంలో పట్టు, క్రమశిక్షణతో సాధన, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయి. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో కూడా మన విద్యార్థులు సత్తా చాటేలా ప్రత్యేక శిక్షణ అందిస్తాం” అని పేర్కొన్నారు.

విద్యార్థుల విజయంతో చిన్నంపేట గ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విజేతలను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

ఏలూరులో రాష్ట్ర స్థాయి అబాకస్ & వేదిక్ మాథ్స్ పోటీల్లో అదిరిపోయిన విజయం!

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News