Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:12 PM

ఎలక్ట్రిసిటీ సవరణ బిల్–2025కు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగుల నల్ల బ్యాడ్జీల నిరసన

12-02-2026 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్–2025కు వ్యతిరేకంగా గురువారం రామన్నపేటలో విద్యుత్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. NCCOEEE–తెలంగాణ పిలుపుమేరకు చేపట్టిన ఈ ఆందోళనలో ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టం–2025ను వెనక్కి తీసుకోవాలని కోరారు. అదేవిధంగా వీబీజీరామ్ చట్ట విత్తన సవరణ బిల్లు, ఎల్బీపీలు 100 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతించే విధానాలను మానుకోవాలని స్పష్టం చేశారు.విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటు చేతుల్లోకి అప్పగించే ప్రయత్నాలు ఉద్యోగుల భవిష్యత్తుతో పాటు ప్రజలకు అందే సేవలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. డిమాండ్లను పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉద్ధృతమైన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ నిరసన కార్యక్రమంలో కట్ట శ్రీకాంత్, ఎం. కోటేశ్వరరావు, డి. మోతిరాం, పి. వేణు రెడ్డి, వి. సందీప్ కుమార్, పి. శ్రీనివాస్, అల్లే రమేష్, కే. శ్రీనివాస్, నల్ల రాములు, కే. సత్తిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, టి. లక్ష్మీ నారాయణ, మేకల సురేష్, ఎస్.కే. చాంద్, కే. వెంకటేష్, ఎండి. అస్లాం, కొమ్ము సైదులు, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎలక్ట్రిసిటీ సవరణ బిల్–2025కు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగుల నల్ల బ్యాడ్జీల నిరసన

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News