Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తూమ్నూర్ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ సంజీవ్ ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 09:27 PM

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతికి కారణమైన గంజాయి స్మగ్లర్లను కఠినంగా శిక్షించాలి

03-02-2026 68 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్

గంజాయి స్మగ్లర్ల దాడిలో అసువులు బాసిన నిజామాబాద్ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతికి కారణమైన గంజాయి స్మగ్లర్లను కఠినంగా శిక్షించాలని డివైఎఫ్ఐ డిమాండ్ చేసింది.

ఈ మేరకు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పట్టణంలోని సుభాష్ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ మాట్లాడుతూ,

జనవరి 23న గంజాయి సరఫరా జరుగుతోందన్న సమాచారం మేరకు నిజామాబాద్ శివారులోని మాధవ నగర్ వద్ద ఎక్సైజ్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారని తెలిపారు. ఈ క్రమంలో ఎక్సైజ్ పోలీసులను చూసిన గంజాయి స్మగ్లింగ్ ముఠా సభ్యులు పారిపోయేందుకు ప్రయత్నించారని, వారిని పట్టుకునే ప్రయత్నంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను గంజాయి ముఠా సభ్యులు తమ కారుతో ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడిందని పేర్కొన్నారు.

ఎనిమిది రోజులపాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ, విధి నిర్వహణలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ప్రాణాలు కోల్పోయిందని అన్నారు. ఆమె కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.పోలీసులకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో నగరాల నుంచీ గ్రామాల వరకు గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా విస్తరిస్తున్నాయని, ప్రభుత్వం మరియు పోలీసు అధికారులు నిరంతరం నిఘా పెట్టాలని సూచించారు.రెండు నెలల క్రితం చర్లపల్లిలో కెమికల్ కంపెనీ పేరుతో డ్రగ్స్ తయారు చేసి విదేశాలకు తరలిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చిందని గుర్తు చేశారు.రాష్ట్ర ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేక స్పెషల్ వింగ్స్ ఏర్పాటు చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే కానిస్టేబుల్ సౌమ్య మృతికి కారణమైన గంజాయి స్మగ్లర్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు మాదాసు రావణ్, గద్దపాటి రఘువరన్, నాగయ్య, అశోక్, శివ, ఆదిల్, తరుణ్, కార్తీక్, వేణు, నవీన్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతికి కారణమైన గంజాయి స్మగ్లర్లను కఠినంగా శిక్షించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News