Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:33 PM

విద్యావిభాగంలో కె. ఉమాదేవికి డాక్టరేట్

విద్యావిభాగంలో కె. ఉమాదేవికి డాక్టరేట్

విద్యావిభాగంలో కె. ఉమాదేవికి డాక్టరేట్
02-02-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయం విద్యావిభాగంలో సహాయ అధ్యాపకురాలిగా విధులు నిర్వర్తిస్తున్న కె. ఉమాదేవి రాయలసీమ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ సాధించారు. “అభివృద్ధి లోపాలు గల పిల్లల సమగ్ర అభివృద్ధిపై ప్రారంభ దశలో చేపట్టే జోక్యాల ప్రభావం” అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది.

ఈ పరిశోధన ఆంగ్ల భాషల విశ్వవిద్యాలయం హైదరాబాద్‌కు చెందిన పదవీ విరమణ పొందిన ఆచార్యుడు డా. వి. సుధాకర్ మార్గదర్శకత్వంలో సాగింది. చిన్న వయసులోనే సమర్థవంతమైన సహాయక చర్యలు అందిస్తే అభివృద్ధి లోపాలు ఉన్న పిల్లల మానసిక, సామాజిక, భావోద్వేగ, విద్యా వికాసం గణనీయంగా మెరుగుపడుతుందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.బోధనా బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ అనేక అవరోధాలు ఎదుర్కొని ఈ పరిశోధనను విజయవంతంగా పూర్తి చేయడం అభినందనీయమని విద్యావేత్తలు ప్రశంసించారు. సమగ్ర విద్యా విధానాల రూపకల్పనకు, అభివృద్ధి లోపాలు గల పిల్లల అభ్యున్నతికి ఈ పరిశోధన దిశానిర్దేశకంగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.ఈ ఘన విజయానికి స్నేహితులు, బంధువులు, సహచరులు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. తన పరిశోధనా ప్రయాణంలో సహకరించిన ఆచార్యులు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు కె. ఉమాదేవి కృతజ్ఞతలు తెలిపారు

Sthanikam

విద్యావిభాగంలో కె. ఉమాదేవికి డాక్టరేట్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News