Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:19 AM

విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి

18-02-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బడ్జెట్‌లో విద్యారంగానికి ₹50 వేల కోట్లు కేటాయించాలి

20న ధర్నా విజయవంతం చేయాలి: బీసీ విద్యార్థి సంఘం

నార్కెట్‌పల్లి, : రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.8,500 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ డిమాండ్ చేశారు. స్థానికంగా నిర్వహించిన విద్యార్థుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజ్యసభ సభ్యుడు ఆర్ . కృష్ణయ్య ఆధ్వర్యంలో ఈ నెల 20న చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

రానున్న 2026–27 బడ్జెట్‌లో విద్యారంగానికి రూ.50 వేల కోట్ల నిధులు కేటాయించి, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ చదువుతున్న విద్యార్థుల పూర్తి ఫీజులను ప్రభుత్వమే భరించాలని కోరారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో మెరుగైన వసతులు కల్పించాలని, అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, స్కాలర్షిప్‌లు ఆలస్యం చేయడం వల్ల పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని విమర్శించారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే ధర్నాలు, రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు.

సమావేశంలో ఎడ్ల మహాలింగం, కాబట్టి సత్తన్న, గోని మహేష్, గిరీష్ రెడ్డి, సురేందర్, యశ్వంత్, ఉపేందర్ రెడ్డి, సుహాస్ గౌడ్, మనీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News