Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:19 PM

విద్యను కార్పొరేటీకరణ వైపు నెట్టే కేంద్ర బడ్జెట్ – నవీన్ కుమార్ గౌడ్

06-02-2026 165 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా యువజన నాయకులు గంగాపురం నవీన్ కుమార్ గౌడ్ కేంద్ర ప్రభుత్వ విద్యా విధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.2026–27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 2.6 శాతం మాత్రమే కేటాయించడం విద్యపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.జీడీపీలో విద్యపై 6 శాతం వ్యయం చేయాలనే జాతీయ లక్ష్యానికి ఈ బడ్జెట్ ఏమాత్రం దగ్గరగా లేదని వ్యాఖ్యానించారు.ఈ బడ్జెట్ రూపకల్పన చూస్తే, గ్రామీణ ప్రాంతాలు, పేద కుటుంబాల పిల్లలకు విద్య దూరం చేసే విధంగా విద్యను కార్పొరేటీకరణ వైపు నెట్టే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు.ప్రభుత్వ పాఠశాలల మూసివేత, ఉపాధ్యాయుల కొరత, మౌలిక సదుపాయాల లేమి వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నప్పటికీ, వాటి పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.ప్రభుత్వ యూనివర్సిటీల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని, కనీస సౌకర్యాలు కూడా అందని స్థితిలో ఉన్నాయని తెలిపారు.నిరుద్యోగ సమస్య రోజురోజుకీ పెరుగుతున్నా, దానికి తగ్గట్లుగా విద్యారంగాన్ని బలోపేతం చేసే విధానం ఈ బడ్జెట్లో కనిపించడం లేదన్నారు.నూతన జాతీయ విద్యా విధానం–2020 అమలు చేస్తామని ప్రకటిస్తున్న కేంద్ర ప్రభుత్వం, దానికి అవసరమైన ఆర్థిక వనరులు కేటాయించకపోవడం విధానాలు–నిధుల మధ్య ఉన్న విరుద్ధతను బయటపెడుతోందని పేర్కొన్నారు.మొత్తానికి ఈ బడ్జెట్ విద్యను ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పించి, ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి నెట్టే దిశగా ఉందని ఆరోపించారు.విద్యారంగానికి తక్షణమే గణనీయమైన నిధులు కేటాయించాలని, లేనిపక్షంలో ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నవీన్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు

Sthanikam

విద్యను కార్పొరేటీకరణ వైపు నెట్టే కేంద్ర బడ్జెట్ – నవీన్ కుమార్ గౌడ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News