Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:17 PM

ఎంఆర్‌పీఎస్ నాయకుడు గుర్కు శివ మృతికి సర్పంచ్ విక్రమ్ నివాళి

05-02-2026 192 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన ఎంఆర్‌పీఎస్ నాయకుడు గుర్కు శివ అకాల మరణం పట్ల గ్రామ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. గుర్కు శివ పార్థివదేహానికి గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ విక్రమ్ మాట్లాడుతూ, సామాజిక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటూ దళితుల హక్కుల కోసం పోరాడిన గుర్కు శివ మరణం తీరని లోటని అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, నల్ల భాస్కర్, శివగల్ల జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొని పార్థివదేహానికి నివాళులు అర్పించారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Sthanikam

ఎంఆర్‌పీఎస్ నాయకుడు గుర్కు శివ మృతికి సర్పంచ్ విక్రమ్ నివాళి

Article Image

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన ఎంఆర్‌పీఎస్ నాయకుడు గుర్కు శివ అకాల మరణం పట్ల గ్రామ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. గుర్కు శివ పార్థివదేహానికి గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ విక్రమ్ మాట్లాడుతూ, సామాజిక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటూ దళితుల హక్కుల కోసం పోరాడిన గుర్కు శివ మరణం తీరని లోటని అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, నల్ల భాస్కర్, శివగల్ల జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొని పార్థివదేహానికి నివాళులు అర్పించారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News