Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:28 PM

ఎం-ప్యానల్ లేకుండా అక్రిడేషన్ నోటిఫికేషన్: జర్నలిస్టులపై చిన్నచూపు!

ఎం-ప్యానల్ లేకుండా అక్రిడేషన్ నోటిఫికేషన్: జర్నలిస్టులపై చిన్నచూపు!

ఎం-ప్యానల్ లేకుండా అక్రిడేషన్ నోటిఫికేషన్: జర్నలిస్టులపై చిన్నచూపు!
February 06, 2026 08:49 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

ఎం-ప్యానల్ లేకుండా అక్రిడేషన్ నోటిఫికేషన్: జర్నలిస్టులపై చిన్నచూపు!

హైదరాబాద్: రాష్ట్రంలో అర్హత ఉన్న చిన్న పత్రికలను ఎం-ప్యానల్‌లో చేర్చకుండానే అక్రిడేషన్‌కు అప్లై చేయాలని సమాచార శాఖ నోటిఫికేషన్ జారీ చేయడం జర్నలిస్టు సంఘాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. ఎన్నికల సమయంలో ప్రజా సమస్యలు ఎత్తి చూపి కాంగ్రెస్‌కు అండగా నిలిచిన చిన్న పత్రికలు, గ్రౌండ్ రిపోర్టర్లు ఇప్పుడు అధికార ప్రభుత్వం చేత పక్కనపెట్టబడుతున్నారా? అనే ప్రశ్నలు గుండెల్లో మీరుతున్నాయి. తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం (టీజేఎస్ఎస్) ఈ నిర్ణయాన్ని ప్రజాస్వామ్యానికి, మీడియా స్వేచ్ఛకు ఆధారాన్ని బలహీనపరిచే చర్యగా కొట్టి చూపింది. ఎం-ప్యానల్ అనేది కేవలం ఒక ఫార్మాలిటీ కాదు – అది పత్రికల నిజస్వరూపాన్ని, క్రమప్రచురణను, ఫీల్డ్ రిపోర్టర్ల ఉనికిని, ప్రజా సమస్యలపై కథనాలను డిపిఆర్వోలు, I&P శాఖ పరిశీలించే కీలక ప్రక్రియ. దీని లేకుండా అక్రిడేషన్ ఇస్తే, పేపర్ మీద మాత్రమే ఉన్న 'బినామీ మీడియా', అధికార పార్టీ అనుకూల సంస్థలకు మార్గం సుగమమవుతుంది. రోడ్డెక్కి వార్తలు తెచ్చే నిజమైన జర్నలిస్టులు మాత్రం నష్టపోతారు. సమాచార శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఈ రిపోర్టర్లపై 'కక్ష' కట్టారా? అని సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.గత టిఆర్ఎస్ పాలితంలో చిన్న పత్రికలకు అన్యాయమైందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు హైలైట్ చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినా, పెద్ద పత్రికలకు ఒక్కరోజు ఇచ్చే అడ్వటైజ్మెంట్ ఖర్చులతో వందలాది చిన్న పత్రికలు బతికి బత్టుకుంటాయి. ఎన్నికల్లో మీడియా సహాయంతో అధికారాన్ని సంపాదించి, ఇప్పుడు అదే మీడియాను తొక్కివేయాలని ఈ నిర్ణయమా? 'చిన్న పత్రికలు అంటే సీఎం రేవంత్‌కి గిట్టదా?' అనే ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది. పెద్దవాటికి కోట్లు ప్రకటనలు, చిన్నవాటికి ఎం-ప్యానల్ కూడా లేదు – ఇదేనా ప్రజా పాలన?

టీజేఎస్ఎస్ స్పష్టం చేసింది: అర్హ పత్రికలను ముందుగా ఎం-ప్యానల్‌లో చేర్చి, ఆ తర్వాత అక్రిడేషన్ ప్రక్రియ చేపట్టాలి. 'నచ్చినవారికి అక్రిడేషన్, ప్రశ్నించేవారికి నిరాకరణ' అనే ధోరణి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. లేకపోతే తీవ్ర ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టుల చిన్నచూపు చూడకుండా, వారికి గౌరవం, గుర్తింపు ఇవ్వడం ద్వారానే ప్రభుత్వం బలపడుతుందని సూచించారు. చిన్న పత్రికలు, నిజమైన రిపోర్టర్లకు న్యాయం జరగాలి – లేకపోతే ఇది మీడియా స్వేచ్ఛపై దాడిగా చరిత్రలో నిలుస్తుంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News