Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:26 AM

ఈ నెలాఖరులోగా లక్ష గృహ ప్రవేశాలు: మంత్రి పొంగులేటి

ఈ నెలాఖరులోగా లక్ష గృహ ప్రవేశాలు: మంత్రి పొంగులేటి

ఈ నెలాఖరులోగా లక్ష గృహ ప్రవేశాలు: మంత్రి పొంగులేటి
08-03-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలును వేగవంతం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 31వ తేదీలోగా లక్ష గృహ యూనిట్లకు గృహ ప్రవేశాలు నిర్వహించాలన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో 3.60 లక్షల ఇళ్లను మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. వచ్చే ఏప్రిల్ నెలలో రెండో దశ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు.

లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన నగదు చెల్లింపులను ఎక్కడైనా నిలిపివేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. డబుల్ బెడ్రూం ఇళ్లకు అర్హుల ఎంపిక ప్రక్రియను కూడా ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

Sthanikam

ఈ నెలాఖరులోగా లక్ష గృహ ప్రవేశాలు: మంత్రి పొంగులేటి

Article Image

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలును వేగవంతం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 31వ తేదీలోగా లక్ష గృహ యూనిట్లకు గృహ ప్రవేశాలు నిర్వహించాలన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో 3.60 లక్షల ఇళ్లను మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. వచ్చే ఏప్రిల్ నెలలో రెండో దశ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు.

లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన నగదు చెల్లింపులను ఎక్కడైనా నిలిపివేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. డబుల్ బెడ్రూం ఇళ్లకు అర్హుల ఎంపిక ప్రక్రియను కూడా ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News