Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:44 AM

ఈ నెల 16 నుంచి తెలంగాణలో అకాల వర్షాలు… రైతులకు హెచ్చరిక

10-03-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

హైదరాబాద్‌,: తెలంగాణలో మళ్లీ అకాల వర్షాలు పడే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానలు పడే ప్రమాదం కూడా ఉందని తెలిపారు.

ఈ పరిస్థితుల్లో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచించారు. కోతకు వచ్చిన పంటలను సురక్షిత ప్రదేశాలకు తరలించడం, తడి పడకుండా సంరక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

మరోవైపు ఈ నెల 15వ తేదీ వరకు రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 33 నుంచి 40 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు.

అకాల వర్షాల ప్రభావంతో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశమున్నప్పటికీ, ఉరుములు–మెరుపుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Sthanikam

ఈ నెల 16 నుంచి తెలంగాణలో అకాల వర్షాలు… రైతులకు హెచ్చరిక

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News