Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:11 PM

దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రత్యేక గౌరవం. కలెక్టర్ హనుమంతరావు

11-02-2026 68 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పచ్చదనం నడుమ పోలింగ్… ఆరు మున్సిపాలిటీల్లో గ్రీన్ మోడల్ కేంద్రాల సందడి

పారదర్శకంగా పోలింగ్… సీసీ కెమెరాల నిఘాలో ప్రశాంతంగా ఎన్నికలు

భువనగిరి,: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా కొనసాగుతోందని జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావు తెలిపారు. ఓటర్లకు ఆహ్లాదకర వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా ఆరు మున్సిపాలిటీల్లో గ్రీన్ మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.బుధవారం జరుగుతున్న పోలింగ్ సందర్భంగా పోచంపల్లి, చౌటుప్పల్ (లింగారెడ్డిగూడెం), భువనగిరి బీచ్ మహల్‌లోని జిల్లా పరిషత్ హైస్కూల్, యాదగిరిగుట్ట (కొత్తగుండ్లపల్లి), ఆలేరు మున్సిపాలిటీలలోని మోడల్ కేంద్రాలను పరిశీలించారు. కేంద్రాల్లో నూతన ఓటర్లకు స్వాగతం పలుకుతూ దివ్యాంగులు, వయోవృద్ధులను సన్మానించారు.గ్రీన్ మోడల్ పోలింగ్ కేంద్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పచ్చని మొక్కలు, పూల అలంకరణ, కొబ్బరి తోరణాలు, ప్లాస్టిక్ రహిత సామగ్రితో పర్యావరణహిత వాతావరణాన్ని కల్పించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తూ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. ఓటర్లు విశేష ఉత్సాహంతో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు.

పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, నీడ, ర్యాంపులు, వీల్‌చైర్లు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పోలింగ్ సిబ్బంది సమయపాలనతో విధులు నిర్వహించాలని, ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.

Sthanikam

దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రత్యేక గౌరవం. కలెక్టర్ హనుమంతరావు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News