Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:22 AM

జిల్లా అభివృద్ధికి బ్యాంకుల సమన్వయం కీలకం: కలెక్టర్ హనుమంతరావు

18-02-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి, : జిల్లాలో బ్యాంకులు పరస్పర సమన్వయంతో పనిచేసి అభివృద్ధికి మరింత కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. బుధవారం మినీ మీటింగ్ హాల్‌లో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఆధ్వర్యంలో నిర్వహించిన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ (డీసీసీ)/డీఎల్‌ఆర్‌సీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.6717.56 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యంగా నిర్ణయించగా, డిసెంబర్ 2025 వరకు రూ.5966.30 కోట్ల రుణాలు మంజూరు చేయడం ద్వారా 88.82 శాతం సాధన నమోదైందని ఎల్‌డిఎం కె. శివ రామకృష్ణ తెలిపారు. ప్రాధాన్యతా రంగంలో రూ.5392.22 కోట్ల లక్ష్యానికి గాను రూ.4219.15 కోట్లు (78.25%) రుణాలు మంజూరయ్యాయి.

మహిళా సంఘాలకు గ్రామీణాభివృద్ధి శాఖ, బ్యాంకుల ద్వారా రూ.611.18 కోట్ల ప్రణాళికకు గాను రూ.502.97 కోట్లు (82.3%) విడుదలయ్యాయి. ఎంఈపీఎంఏ ద్వారా రూ.104.08 కోట్ల రుణాలు మంజూరయ్యాయి.కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎంఈజీపీ,పీఎం విశ్వకర్మ ,పీఎం స్వనిది , జన సురక్ష పథకాల వంటి పథకాల లక్ష్యాలను బ్యాంకులు సమయానికి పూర్తి చేయాలని సూచించారు.

అనంతరం 2026–27 సంవత్సరానికి నాబార్డ్ రూపొందించిన పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ (పీఎల్‌పీ) కరదీపికను కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లాకు సంబంధించి పీఎల్‌పీ ప్రకారం ఎంఎస్‌ఎంఈలకు రూ.1182.52 కోట్లు, విద్యారుణాలకు రూ.22.57 కోట్లు, గృహరుణాలకు రూ.90.34 కోట్లు, ఇతర ప్రాధాన్యతా రంగాలకు రూ.28.58 కోట్లు కలిపి మొత్తం రూ.6337.71 కోట్ల ఆర్థిక అవకాశాన్ని నాబార్డ్ అంచనా వేసింది.

సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం రవీందర్, ఆర్బీఐ ఏజీఎం లక్ష్మీ శ్రావ్య, నాబార్డ్ డీడీఎం రవీందర్, ఎంఈపీఎంఏ డీఎంసీ రమేష్, ఎల్‌డిఎం కె. శివ రామకృష్ణ, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

జిల్లా అభివృద్ధికి బ్యాంకుల సమన్వయం కీలకం: కలెక్టర్ హనుమంతరావు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News