Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:37 AM

డిపిఓ విష్ణువర్ధన్ రెడ్డి కి ఘన వీడ్కోలు

13-04-2026 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓగా విధులు నిర్వహించిన విష్ణువర్ధన్ రెడ్డి గారికి పదోన్నతి లభించి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి (DRDO)గా సూర్యాపేట జిల్లాకు బదిలీ అయిన సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ, విష్ణువర్ధన్ రెడ్డి తన పదవీకాలంలో జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా పరిషత్ సీఈఓగా వివిధ రంగాలలో విశేష సేవలు అందించారని కొనియాడారు. గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రజలకు చేరువైన పరిపాలనలో ఆయన చూపిన నిబద్ధత ప్రశంసనీయమని అన్నారు. పంచాయతీ ఎన్నికలను సమన్వయంతో, ఎలాంటి లోపాలు లేకుండా విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు.

రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ ప్రతి ఫైలును సులభతరంగా పరిష్కరించే విధంగా కృషి చేశారని ప్రశంసించారు. పారదర్శకంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం ఆయన పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆయన మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్ఓ జయమ్మ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి, జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

డిపిఓ విష్ణువర్ధన్ రెడ్డి కి ఘన వీడ్కోలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News