Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:00 AM

డీప్ ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం

డీప్ ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం

డీప్ ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం
March 01, 2026 02:40 PM 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ డీప్ ఫేక్ వీడియోలను సృష్టించి తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కొందరు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

కృత్రిమ మేధస్సు సాంకేతికతను దుర్వినియోగం చేసి తన రూపాన్ని, స్వరాన్ని అనుకరించే విధంగా వీడియోలు తయారు చేసి ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈ కంటెంట్ మొత్తం అసత్యమైనదని, వక్రీకరించినదని స్పష్టం చేశారు. ఇది కేవలం తన వ్యక్తిగత ప్రతిష్ఠను కాకుండా టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చేందుకు పన్నిన పథకమని పేర్కొన్నారు.

ఈ వ్యవహారం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని, వైసీపీకి చెందిన కొందరు ఈ తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. నాపై జరుగుతున్న ఈ దుష్ప్రచారంపై చట్టపరంగా ముందుకెళ్తానని హెచ్చరించారు.

సోషల్ మీడియాలో తనపై సాగుతున్న అసత్య ప్రచారం వెనుక ఉన్న కుట్రను వెలికితీయాలని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్న వ్యక్తులను, దుష్ట శక్తులను వదిలేది లేదని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News