Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తూమ్నూర్ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ సంజీవ్ ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 09:26 PM

దళితవాడకు తాగునీటి దాహం… అధికారుల నిర్లక్ష్యంపై రోడ్డెక్కిన మహిళలు

29-01-2026 286 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
విజయనగరం స్థానికం ప్రధాన ప్రతినిధి

విజయనగరం జిల్లా, రేగిడి మండలం, సరసానపల్లి:దళితవాడలను చిన్నచూపు చూస్తున్నారని, కనీస అవసరమైన తాగునీటికోసం ఎన్నిసార్లు విన్నవించినా కూటమి ప్రభుత్వంలో పట్టించుకునే నాథుడే లేడని దళిత మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.విజయనగరం జిల్లా రేగిడి మండలం సరసానపల్లి సచివాలయం ఎదుట వృద్ధులు, మహిళలు పెద్ద సంఖ్యలో చేరి తాగునీటి సమస్యపై నిరసన తెలిపారు.దళితవాడలో సుమారు 45 కుటుంబాలు రెండు వారాలుగా మంచినీటి సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాలేదని, పాలకులు తమ గోడు వినిపించుకోవడంలేదని నిరసనకారులు ఆరోపించారు.రోజువారీ అవసరాలకే కాకుండా వృద్ధులు, చిన్నారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.సచివాలయాల వ్యవస్థ ఉన్నప్పటికీ సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని మహిళలు మండిపడ్డారు. తక్షణమే ఎమ్మెల్యే స్పందించి దళితవాడకు శాశ్వత తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

మౌలిక వసతుల విషయంలోనూ వివక్ష కొనసాగుతుందా? అన్న ప్రశ్నలు ఈ నిరసనతో ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతారా? అన్నది వేచి చూడాల్సిందే.

Sthanikam

దళితవాడకు తాగునీటి దాహం… అధికారుల నిర్లక్ష్యంపై రోడ్డెక్కిన మహిళలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News