Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సింగరేణి అధికారుల ఫిర్యాదుపై బాల్క సుమన్‌కు 14 రోజుల రిమాండ్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 31, 2026 10:39 AM

చుండూరు మారణకాండ.. అయేషా మీరా హత్య.. అధికారం లేకుండా న్యాయం లేదంటే రాజకీయ చైతన్యం రగిలించాలి!

చుండూరు మారణకాండ.. అయేషా మీరా హత్య.. అధికారం లేకుండా న్యాయం లేదంటే రాజకీయ చైతన్యం రగిలించాలి!

చుండూరు మారణకాండ.. అయేషా మీరా హత్య.. అధికారం లేకుండా న్యాయం లేదంటే రాజకీయ చైతన్యం రగిలించాలి!
February 25, 2026 10:56 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

"పోలీయో బిడ్డ గొడ్డలి పట్టుకొని పరిగెత్తి చంపాడు?".. FIRలో అవుటంగా రాసిన పోలీసులు - మాలల రాజ్యాధికార సాధన సమితి ఆగ్రహం

మాలల రాజ్యాధికార సాధన సమితి రెండు దారుణ సంఘటనలను గుర్తు చేస్తూ, అధికారం లేకుండా న్యాయం దక్కదని, బాబాసాహెబ్ అంబేద్కర్ "రాజకీయ అధికారం మాస్టర్ కీ" అన్న మాటలను పునరుద్ఘాటించింది. చుండూరు మారణకాండ, అయేషా మీరా హత్య కేసుల్లో పోలీసులు, రాజకీయ నాయకులు ఎలా న్యాయాన్ని మోసం చేశారో వివరిస్తూ, SCలు అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. "అడుక్కోవడం మానేయండి.. రాజకీయం చేయండి" అని యువతకు మార్గదర్శనం చేశారు.

1. చుండూరు మారణకాండ (1991):గుంటూరు జిల్లా చుండూరులో DSP సాయిబాబా ముఖ్యత్వంలో పోలీసులు 11 మంది మాలలను దగ్గరుండి వేటాడి నరికి చంపారు. రెడ్లు దొంగతనం చేశారని తెలిసినప్పటికీ, ప్రతీకారంగా SCలను చంపారు. FIRలో "పోలీయో వ్యాధిగ్రస్తుడు గొడ్డలి పట్టుకొని పరుగెత్తి ఇద్దరిని చంపాడు" అని అవుటంగా రాశారు.న్యాయమూర్తి ఈ భాషణాన్ని కొట్టేసి, "అక్కడ చనిపోయినవాళ్లు కొవ్వెక్కి ఏమి చేయలేరు.. వాళ్లను పోలీసులే నరికి చంపారు" అని స్పష్టం చేశారు. పోలీసులు FIR, కోర్టులో కేసు వీగిపోయేలా చేశారు. SC నాయకులు ప్రత్యేక కోర్టు కోసం పోరాడారు కానీ, అధికారం లేకపోవడం వల్ల పూర్తి న్యాయం దక్కలేదు.

2. అయేషా మీరా హత్య కేసు: కాలేజ్ హాస్టల్లో చదువుతున్న అయేషా మీరాను కాలేజి యజమాని కొడుకు పాశవికంగా మానభంగం చేసి హత్య చేశాడు. అందరికీ తెలిసినప్పటికీ, పోలీసులు SC యువకుడు సత్యంబాబును తప్పించుకొని అరెస్ట్ చేశారు. తల్లిదండ్రుల పోరాటంతో సత్యంబాబు నిర్దోషిగా విడుదలయ్యాడు. CBI దర్యాప్తు సాగినా, కోర్టు తీర్పు షాకింగ్ - "అయేషా మీరా కొవ్క్కెక్కి కొట్టుకుంటూ తనను తానే రేప్ చేసుకొని చంపుకుంది" అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి దోషులను తప్పించినట్టు ఆరోపణలు ఉన్నాయి. తల్లిదండ్రులు ఇంకా పోరాడుతున్నారు కానీ, న్యాయం దక్కలేదు.

ఈ రెండు సంఘటనల్లో స్పష్టంగా కనిపించింది - అధికారం లేకుండా న్యాయం లేదు. పోలీసులు, రాజకీయ నాయకులు కుల రాజకీయాలతో SCలను బలిగొట్టారు. చుండూరులో పోలీసులే నరికి చంపి FIRలో మోసపూరిత కథలు రాశారు. అయేషా మీరా కేసులో నిజ దోషి తప్పించుకుని SC యువకుడిని బంధించారు. రాజకీయ అధికారం ఉంటే ఈ అన్యాయాలు జరగవు. బాబాసాహెబ్ అంబేద్కర్ "రాజకీయ అధికారం మాస్టర్ కీ.. అన్ని తాళాలు దీనితో తెరుచుకుంటాయి" అన్నారు. "నా వారసులారా రాజకీయం చేయండి..అధికారంలో అడుగుపెట్టండి.. అడుక్కోవడం మానండి" అని స్పష్టం చేశారు.

మాలల రాజ్యాధికార సాధన సమితి ఈ సంఘటనలను గుర్తు చేస్తూ, SC యువతకు రాజకీయ చైతన్యం పెంపొందించాలని పిలుపునిచ్చింది. "అధికారంలో భాగస్వాములు అవ్వండి..రోడ్లపై అరుస్తూ గడిచే రోజులు ముగించండి" అని సమర్థించారు. రాజకీయ అధికారం సాధించితే చుండూరు, అయేషా మీరా లాంటి కేసుల్లో న్యాయం సులభంగా దక్కుతుందని, మన తల రాతలు మారుతాయని చెప్పారు. సమితి నాయకులు SCలురాజకీయంగా బలపడితే అన్యాయాలు ఆగుతాయని, అధికారం మాస్టర్ కీలా పనిచేస్తుందని హైలైట్ చేశారు.

ఈపిలుపు SC సమాజంలో ఆత్మవిశ్వాసం కల్పిస్తోంది. రాజకీయ చైతన్యం రగిలించి, అధికారం వైపు ముందుకు సాగాలని సమితి ప్రోత్సహిస్తోంది. చుండూరు మారణకాండ 35 ఏళ్ల క్రితం జరిగినా, న్యాయం పూర్తిగా జరగలేదు. అయేషా మీరా తల్లిదండ్రులు ఇంకా పోరాడుతున్నారు. ఇలాంటి అన్యాయాలు పునరావృతం కాకుండా రాజకీయ అధికారం సాధించాలని సమితి స్పష్టం చేసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News