Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కేతకీ సంగమేశ్వర స్వామిని దర్శించుకున్న డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 09:29 PM

చౌటుప్పల్ 10వ వార్డులో రాజకీయ వేడి బిఆర్ఎస్ అభ్యర్థిగా ఉడుగు కల్పన మల్లేశం గౌడ్ నామినేషన్

30-01-2026 63 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు నుంచి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉడుగు కల్పన మల్లేశం గౌడ్ మున్సిపల్ ఎన్నికల బరిలో నిలవడంతో వార్డులో ఎన్నికల సందడి నెలకొంది. ఆమె అధికారికంగా నామినేషన్ దాఖలు చేయడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.ఈ సందర్భంగా ఉడుగు కల్పన మల్లేశం గౌడ్ మాట్లాడుతూ, వార్డులోని మౌలిక సదుపాయాల లోపాలు, తాగునీటి సమస్య, రహదారుల అభివృద్ధి, పారిశుధ్య అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే ప్రతినిధిగా పనిచేస్తానని హామీ ఇస్తూ, పారదర్శక పాలనతో పాటు ప్రజా సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. 10వ వార్డు సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపాలని వార్డు ప్రజలను కోరిన ఆమె, కౌన్సిలర్‌గా అవకాశం ఇస్తే మరిన్ని సేవలు ప్రజలకు అందిస్తానని భరోసా ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సహకారంతో, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అండదండలతో, కేటీఆర్ సారథ్యంలో వార్డులో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.

Sthanikam

చౌటుప్పల్ 10వ వార్డులో రాజకీయ వేడి బిఆర్ఎస్ అభ్యర్థిగా ఉడుగు కల్పన మల్లేశం గౌడ్ నామినేషన్

Article Image

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు నుంచి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉడుగు కల్పన మల్లేశం గౌడ్ మున్సిపల్ ఎన్నికల బరిలో నిలవడంతో వార్డులో ఎన్నికల సందడి నెలకొంది. ఆమె అధికారికంగా నామినేషన్ దాఖలు చేయడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.ఈ సందర్భంగా ఉడుగు కల్పన మల్లేశం గౌడ్ మాట్లాడుతూ, వార్డులోని మౌలిక సదుపాయాల లోపాలు, తాగునీటి సమస్య, రహదారుల అభివృద్ధి, పారిశుధ్య అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే ప్రతినిధిగా పనిచేస్తానని హామీ ఇస్తూ, పారదర్శక పాలనతో పాటు ప్రజా సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. 10వ వార్డు సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపాలని వార్డు ప్రజలను కోరిన ఆమె, కౌన్సిలర్‌గా అవకాశం ఇస్తే మరిన్ని సేవలు ప్రజలకు అందిస్తానని భరోసా ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సహకారంతో, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అండదండలతో, కేటీఆర్ సారథ్యంలో వార్డులో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News