Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:35 AM

చంద్రబాబుతో ఉంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలు బిల్ గేట్స్ ను కలుస్తారు జగన్ ను నమ్ముకుంటే వారంతా గేటు బయటే ఉంటారు మంత్రి కొలుసు పార్ధసారధి

16-02-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్న బిల్ గేట్స్ పర్యటన

వైరల్ అవుతున్న మంత్రి కొలుసు పార్దసారధి సోషల్ మీడియా పోస్ట్

అమరావతి: బిల్ గేట్స్ అమరావతి పర్యటన. రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని అంశం. గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ సోమవారం అమెరికా నుంచి నేరుగా అమరావతికి వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా మంత్రులు, కార్యదర్శులతో భేటీ అయ్యారు. బ్రేక్ ఫాస్ట్ మీటింగులో పాల్గొన్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చేపడుతున్న ప్రాజెక్టుల పురోగతి తెలుసుకున్నారు. స్థూలంగా చెప్పాలంటే బిల్ గేట్స్ పర్యటన సారాంశం ఇదే. కానీ ఈ పర్యటన రాజకీయంగా చర్చకు దారి తీస్తోంది. మంత్రి కొలుసు పార్ధసారధి పెట్టిన ఓ సోషల్ మీడియా పోస్టింగ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెర లేపింది. ఇంతకీ ఆ పోస్ట్ సారాంశం ఏమిటంటే... బిల్ గేట్స్ అమరావతికి వచ్చి సెక్రటేరీయేట్ చేరుకున్న తర్వాత... సీఎం చంద్రబాబు తన మంత్రి వర్గ సహచరులు అందర్నీ పేరు పేరునా బిల్ గేట్స్ కు పరిచయం చేశారు. దీనికి సంబంధించి మంత్రి కొలుసు పార్ధసారధి తన సోషల్ మీడియా హ్యాండిల్సులో ఆసక్తికరమైన ఓ పోస్ట్ పెట్టారు. “చంద్రబాబు గారితో ఉంటే బిల్ గేట్స్ ను కలుస్తారు... జగన్ ను నమ్ముకుంటే గేట్ బయట ఉంటారు..” అని కామెంట్ చేస్తూ రెండు ఫొటోలను జత చేశారు. సీఎం చంద్రబాబు తనను బిల్ గేట్స్ కు పరిచయం చేస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే దీనికి మరో ఫొటో జత చేశారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఓసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు సామాజిక వర్గాలకు చెందిన ఎంపీలను తన ఇంటి గుమ్మం బయటే నిలబెట్టిన ఫొటో అప్పట్లో బాగా వైరల్ అయింది. ఆనాటి ఫొటోను మొదటి ఫొటోకు జత చేసి మంత్రి కొలుసు పోస్ట్ చేశారు. ఇప్పుడిదే సోషల్ మీడియాలో ట్రెడింగ్ గా మారింది. తన సహచరులను చంద్రబాబు ఎలా ట్రీట్ చేస్తారు..? జగన్ మోహన్ రెడ్డి ఎలా ట్రీట్ చేస్తారు..? అనేది మంత్రి కొలుసు చేసిన సోషల్ మీడియా పోస్టింగుతో ఇట్టే అర్థమైపోతోందనేది రాజకీయ, మీడియా వర్గాల్లో జరుగుతోన్న చర్చ. మంత్రి కొలుసు పార్ధసారది పూర్వాశ్రమంలో వైసీపీలో ఉండి వచ్చారు కనుక... అక్కడి పరిస్థితులేంటో, జగన్ మోహన్ రెడ్డి నైజం ఏంటో అందరికంటే ఆయనకే ఎక్కువగా తెలుసని అంటున్నారు. నాడు తాను పడ్డ అవమానాలను... ఇప్పుడు తనకు జరుగుతున్న సత్కారాలను పోల్చుకుంటూ మంత్రి కొలుసు ఈ పోస్టింగ్ చేసి ఉంటారనే దిశగా మీడియా సర్కిల్సులో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో మరో చర్చ కూడా జరుగుతోంది. చంద్రబాబును నమ్ముకున్న వారు జాతీయ అంతర్జాతీయ స్థాయి వ్యక్తులను కలవడంతో పాటు వారికి ఆ స్థాయి గౌరవం, గుర్తింపు దక్కుతుందని అంటున్నారు. జగన్ మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఆయనతో పని చేసిన పాపానికి రాజకీయ నేతలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జైళ్ల పాలవడం ఖాయమనే అంశం కూడా పొలిటికల్ సర్కిల్సులో చర్చనీయాంశంగా మారింది.

Sthanikam

చంద్రబాబుతో ఉంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలు బిల్ గేట్స్ ను కలుస్తారు జగన్ ను నమ్ముకుంటే వారంతా గేటు బయటే ఉంటారు మంత్రి కొలుసు పార్ధసారధి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News