Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కేతకీ సంగమేశ్వర స్వామిని దర్శించుకున్న డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 09:30 PM

చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి రుద్రవరం యాదయ్య గెలుపుపై ధీమా.పోషబోయిన మల్లేశం

04-02-2026 340 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల మున్సిపాలిటీలో జరుగుతున్న వార్డు ఎన్నికల ప్రచారం ఉద్ధృతంగా కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులు ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఒకటవ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి పార్టీ రుద్రవరం యాదయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఒకటవ వార్డు ఇంచార్జ్ పోషబోయిన మల్లేశం మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేసిన మేలు స్పష్టమని తెలిపారు. స్థానిక మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య చిట్యాల పట్టణాన్ని కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేసిన విషయం ప్రజలకు తెలుసన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటు వేయాల్సిన అవసరం ఉందని ఓటర్లను కోరారు.బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రామన్నపేట మాట్లాడుతూ, పార్టీ అభ్యర్థుల గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఒక్కసారి ఆలోచించి అభివృద్ధికి మద్దతుగా తమ ఓటు వినియోగించాలని సూచించారు.ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఎన్నారం మాజీ సర్పంచ్ మెట్టు మహేందర్ రెడ్డి, జనంపల్లి ఉపసర్పంచ్ చొప్పరి నరసింహ, గట్టు నరేందర్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి రుద్రవరం యాదయ్య గెలుపుపై ధీమా.పోషబోయిన మల్లేశం

Article Image

చిట్యాల మున్సిపాలిటీలో జరుగుతున్న వార్డు ఎన్నికల ప్రచారం ఉద్ధృతంగా కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులు ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఒకటవ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి పార్టీ రుద్రవరం యాదయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఒకటవ వార్డు ఇంచార్జ్ పోషబోయిన మల్లేశం మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేసిన మేలు స్పష్టమని తెలిపారు. స్థానిక మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య చిట్యాల పట్టణాన్ని కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేసిన విషయం ప్రజలకు తెలుసన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటు వేయాల్సిన అవసరం ఉందని ఓటర్లను కోరారు.బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రామన్నపేట మాట్లాడుతూ, పార్టీ అభ్యర్థుల గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఒక్కసారి ఆలోచించి అభివృద్ధికి మద్దతుగా తమ ఓటు వినియోగించాలని సూచించారు.ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఎన్నారం మాజీ సర్పంచ్ మెట్టు మహేందర్ రెడ్డి, జనంపల్లి ఉపసర్పంచ్ చొప్పరి నరసింహ, గట్టు నరేందర్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News