Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలపై ఎలాంటి మార్పు లేదు; ఎమ్మెల్యే సామెల్ తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:38 PM

చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డు స్వతంత్ర అభ్యర్థి నాగిళ్ల సుధాకర్ ఇంటింటా ప్రచారం

చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డు స్వతంత్ర అభ్యర్థి నాగిళ్ల సుధాకర్ ఇంటింటా ప్రచారం

చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డు స్వతంత్ర అభ్యర్థి నాగిళ్ల సుధాకర్ ఇంటింటా ప్రచారం
February 07, 2026 02:49 PM 94 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి

చిట్యాల మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల్లో ఒకటో వార్డు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగిళ్ల సుధాకర్ శివనేనిగూడెం గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సీరియల్ నెంబర్–6లో ఉన్న ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

ఈ సందర్భంగా నాగిళ్ల సుధాకర్ మాట్లాడుతూ…శివనేనిగూడెం గ్రామంలో 99 శాతం మంది రైతులే ఉన్నారని, కానీ గ్రామాన్ని స్వార్థ రాజకీయాల కోసం మున్సిపాలిటీలో కలపడంతో రైతులు, రైతు కూలీలకు ఉపయోగపడే ఉపాధి హామీ పనులు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ వచ్చాక గ్రామానికి జరిగిన అభివృద్ధి ఏంటని ప్రశ్నిస్తూ…

ప్రతి సంవత్సరం అధిక పన్నులు వసూలు చేయడం, గ్రామంలో చెత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడటం తప్ప గ్రామానికి ఒరిగిందేమీ లేదన్నారు.ఇప్పటివరకు వివిధ పార్టీల తరఫున గెలిచిన ప్రజాప్రతినిధులు తమ స్వంత అభివృద్ధికే పరిమితమయ్యారని, గ్రామ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని విమర్శించారు.

గెలిచిన తర్వాత చేపట్టే కార్యక్రమాలు:

అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించడం

గ్రామంలో పూర్తి కాని సీసీ రోడ్లను త్వరితగతిన పూర్తి చేయించడం

డంపింగ్ యార్డ్ తొలగింపుకు ప్రత్యేక కృషి

మహాలింగేశ్వర స్వామి జాతరకు రూ.25,000 విరాళం

గ్రామంలో కోతుల బెడద లేకుండా చర్యలు

ప్రతి ఆడపిల్ల వివాహానికి రూ.10,016 నగదు సహాయం

శివాలయం, ఆంజనేయస్వామి ఆలయాలకు కమిటీలు ఏర్పాటు చేసి నిత్య దీపారాధన

స్కూల్ నుంచి మహాలింగేశ్వర ఆలయం వరకు స్ట్రీట్ లైట్లు ఏర్పాటు

గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు

మెరుగైన విద్య, వైద్య, విద్యుత్, పరిశుభ్రత సదుపాయాలు

తాను కౌన్సిలర్‌గా గెలిచిన తర్వాత సొంత నిధులతోనూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News