Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 08:19 AM

చినిగేపల్లిలో వెంకట్ రెడ్డి ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవం

04-05-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్,

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద న్యాల్కల్ మండలంలోని చినిగేపల్లి గ్రామంలో వెంకట్ రెడ్డి నూతన ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజల సమక్షంలో గృహప్రవేశం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రభుత్వం పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పూర్తయిన ఇళ్లను దశలవారీగా లబ్ధిదారులకు అందజేస్తున్నారు. చినిగేపల్లి గ్రామంలో వెంకట్ రెడ్డి ఇంటి ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక ప్రజలు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సుధాకర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. అలాగే హాజీ పటేల్, పంచాయతీ కార్యదర్శి గౌస్, మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

చినిగేపల్లిలో వెంకట్ రెడ్డి ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News