Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:30 PM

చిన్న శ్రీశైలం గుట్టపై బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్త లగ్న నిర్ణయం

05-02-2026 338 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో మల్లన్న గుట్టపై కొలువై ఉన్న శ్రీ స్వయంభు భ్రమరాంబ మల్లికార్జున స్వామి

(చిన్న శ్రీశైలం ) ఆలయంలో రానున్న బ్రహ్మోత్సవాల లగ్న నిర్ణయ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో మహాక్రతుగా జరిగింది. వేదమంత్రాల నడుమ ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడింది.ఆలయ అర్చకులు, వేదపండితులు బేతోజు సత్యనారాయణ శాస్త్రి, శశిధర దీక్షితులు శాస్త్రోక్తంగా లగ్నాన్ని నిర్ణయించారు. బ్రహ్మోత్సవాలు శుభప్రదంగా నిర్వహించేందుకు స్వామి ఆశీస్సులు లభించాయని పండితులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ సల్ల నరసింహ, డైరెక్టర్లు ఆగు లింగస్వామి, సంకు స్వామి, కడారి మల్లేశం, భాషమల్ల బాలరాజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గ్రామ సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య, ఉపసర్పంచ్ కొండ అండాలు మల్లయ్యతో పాటు వార్డు సభ్యులు సల్ల శిల్పా మల్లేష్, కొండ శ్రీను, వరకాల వినయ్, వంగల పూజిత శివకుమార్, ఏకుల మల్లేష్, భాషమల్ల సంతోష్, కడారి ఐలయ్య గ్రామ పెద్దలు బొడిగె రంగయ్య, సల్ల శ్రీశైలం, వల్లమల మల్లయ్య, తోటకూరి ఐలయ్య, దయ్యాల బిక్షం, కడారి బిక్షం, కడారి యాదయ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చిన్న శ్రీశైలం గుట్టపై బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్త లగ్న నిర్ణయం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News