Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:26 PM

చేవెళ్ల మహిళా న్యాయవాది హత్య కేసులో వీడిన మిస్టరీ!!

చేవెళ్ల మహిళా న్యాయవాది హత్య కేసులో వీడిన మిస్టరీ!!

చేవెళ్ల మహిళా న్యాయవాది హత్య కేసులో వీడిన మిస్టరీ!!
February 05, 2026 01:40 PM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

చేవెళ్ల మహిళా న్యాయవాది హత్య కేసులో వీడిన మిస్టరీ!!

నిన్న రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన మహిళా న్యాయవాది స్వప్న హత్య కేసులో కీలక అంశాలు బయట పడ్డాయి, తన సొంత అన్న రాజు భూ వివాదంలో స్వప్న గొంతు కోసి హత్య పారిపోయిన విషయం వెలుగులోకి వచ్చింది,వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో నివాసం ఉండే గొటికె శాంతయ్యకు ఇద్దరు కూతుళ్లు,ఒక కుమారుడు,వీరిలో కొడుకు,పెద్ద కూతురుకి వివాహం జరిగింది,చేవెళ్ల కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న చిన్న కూతురు స్వప్న(34)కు ఇంకా వివాహం కాలేదు.

అసలు విషయానికొస్తే శాంతయ్య మరణానంతరం అతని పేరు మీద ఉన్న 10 ఎకరాల భూమిని భార్యవెంకటమ్మ పేరిట రిజిస్ట్రేషన్ చేశారు,అందులో ఆరు ఎకరాల భూమిని తన కొడుకు రాజు పేరిట రిజిస్ట్రేషన్ చేసి మిగిలిన నాలుగు ఎకరాల భూమిని వెంకటమ్మ తన పేరుమీద ఉంచుకుంది,ఆ తరువాత గత సంవత్సరం క్రితం స్వప్నకు తెలియకుండా తన తల్లి పేరు మీద ఉన్న నాలుగు ఎకరాల భూమిని అన్న రాజు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు,ఈ విషయం మీద స్వప్న పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసి,తన అన్న రాజు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న నాలుగుఎకరాల భూమిని తిరిగి తల్లి పేరిట స్వప్న రిజిస్ట్రేషన్ చేయించింది.

ఆ క్రమంలో స్వప్నపై కక్ష పెంచుకున్న రాజు గత నెలలో ఒకసారి స్వప్న కోర్టుకు వెళ్తున్న క్రమంలో స్కూటీకి యాక్సిడెంట్ చేసి హత్యా యత్నం చేయగా ఆ సంఘటనలో స్వప్న కాలు విరిగింది,తన అన్నే తనపై దాడి చేయించాడని స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడు రాజుపై కేసు నమోదు చేసారు. దీంతో మరింత కక్ష పెంచుకున్న రాజు,భూ తగాదాల్లో రోజు రోజుకు స్వప్న వేధింపులు ఎక్కువ అవుతున్నాయని, తనపై హత్యాయత్నం కేసు పెట్టిందని, దాన్ని చంపేస్తానని రాజు గత కొద్ది రోజులుగా తమతో చెబుతున్నట్లు అతని స్నేహితులు పేర్కొన్నారు,ఈ క్రమంలోనే స్వప్న తన తల్లితో కలిసి పొలం వద్ద సర్వే చేయిస్తుండగా, కొందరు వ్యక్తులతో పొలం వద్దకు వచ్చిన రాజు స్వప్నపై కత్తితో దాడి చేసి,ఆమె గొంతు కోసి పారిపోయాడు,చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే స్వప్న మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు, దీంతో స్వప్నను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ తోటి న్యాయవాదులు పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగారు….

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News