Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:32 AM

చేనేత కార్మికులకు ‘ఆరోగ్య భరోసా’… వైద్య శిబిరాలకు మంచి స్పందన. అదనపు కలెక్టర్

16-04-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆలేరు,

జిల్లాలోని చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సూచించారు. గురువారం ఆలేరు గౌడ సంఘ భవనంలో చేనేత కార్మికుల కోసం “ఆరోగ్య భరోసా” కార్యక్రమాన్ని నిర్వహించారు.

చేతి మగ్గాలపై పట్టు దారాలతో వస్త్రాలను నేసే చేనేత వృత్తి సాంస్కృతిక వారసత్వంగా కొనసాగుతుండగా, ఈ వృత్తిలో ఉన్న కార్మికులకు ఆరోగ్య భరోసా కల్పించాలనే లక్ష్యంతో జిల్లా ఆరోగ్య శాఖ, హ్యాండ్లూమ్ & టెక్స్టైల్స్ శాఖల సమన్వయంతో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని ఆలేరు మున్సిపల్ చైర్‌పర్సన్ బాలమణి భాస్కర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. శిబిరంలో కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్సలు, ల్యాబ్ పరీక్షలు అందించారు. హెల్త్ కార్డులు పంపిణీ చేసి, ప్రతి కార్మికుడి వైద్య వివరాలను నమోదు చేశారు. అవసరమైన మందులు కూడా అందజేశారు.

చేనేత కార్మికులు వృత్తి కారణంగా అనేక శారీరక సమస్యలు ఎదుర్కొంటారని, ఇలాంటి మెడికల్ క్యాంపులు వారికి ఉపయుక్తంగా ఉంటాయని మున్సిపల్ చైర్‌పర్సన్ పేర్కొన్నారు. జిల్లా వైద్యాధికారి డా. మనోహర్ మాట్లాడుతూ, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకుని చికిత్స పొందాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆంజనేయులు, DRDA PD నాగిరెడ్డి, హ్యాండ్లూమ్ & టెక్స్టైల్స్ శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, వైద్య సిబ్బంది, కౌన్సిలర్లు, చేనేత సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

చేనేత కార్మికులకు ‘ఆరోగ్య భరోసా’… వైద్య శిబిరాలకు మంచి స్పందన. అదనపు కలెక్టర్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News