Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:32 PM

చీమలకొండూరులో పౌర హక్కుల దినోత్సవం

చీమలకొండూరులో పౌర హక్కుల దినోత్సవం

 చీమలకొండూరులో పౌర హక్కుల దినోత్సవం
31-01-2026 125 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పౌర హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులపై ప్రతి పౌరుడూ అవగాహన కలిగి ఉండాలని భువనగిరి మండల ఉప తహసీల్దార్ కళ్యాణ్ తెలిపారు. శనివారం భువనగిరి మండలంలోని చీమలకొండూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ పల్లెర్ల అంజయ్య అధ్యక్షతన నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సీ–ఎస్టీ విజిలెన్స్ మరియు పర్యవేక్షణ కమిటీ సభ్యుడు బర్రె సుదర్శన్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు కల్పించిన హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. హక్కులకు భంగం కలిగితే అధికారుల ద్వారా, న్యాయస్థానాల ద్వారా రక్షించుకోవాలని సూచించారు.

గ్రామ సర్పంచ్ పల్లెర్ల అంజయ్య మాట్లాడుతూ గ్రామానికి అదనంగా ఇరవై ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని, స్మశాన వాటికలలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. అలాగే ఎస్సీ కాలనీలో మురికి కాలువల నిర్మాణం, మంచినీటి సరఫరాకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ మాట్లాడుతూ గ్రామంలో బడి ఈడు పిల్లలను తప్పనిసరిగా పాఠశాలలకు పంపించాలని, బాల్య వివాహాలు జరగకుండా చూడాలని, బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని కోరారు.ఈ సమావేశంలో కమ్యూనిటీ ఆరోగ్య అధికారి రమాదేవి, భువనగిరి గ్రామీణ సహాయ ఉప పరిశీలకుడు అశోక్ ఆరోగ్య సమస్యలు, గ్రామాల్లో అంటరానితనం, మూడనమ్మకాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పల్లెర్ల బాలస్వామి, నారికడప నర్సింగరావు, గ్రామ పరిపాలన అధికారి బోట్ల రమేష్, వసతి గృహాల సంక్షేమ అధికారి నాగసైదులు, ఎంఎల్‌హెచ్‌పీ దివ్య, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు శ్రీనివాస్, ఉదయ్, సాయమ్మ, పోచమ్మ, సంతోష్, కిషన్, పద్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చీమలకొండూరులో పౌర హక్కుల దినోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News