Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:13 AM

చరిత్రలో మరుగునపడిన ‘సర్దార్ సర్వాయి పాపన్న గుండు’

07-01-2026 357 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
సర్వాయి పాపన్న అడుగుజాడల్లో నాగిరెడ్డిపల్లి బండరాయి
గోల్కొండ ప్రయాణాల్లో విశ్రాంతి కేంద్రమైన పాపన్నగుండు

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

చాలామందికి తెలియని ఒక చారిత్రక ఆనవాళ్లుగా ‘సర్దార్ సర్వాయి పాపన్న గుండు’ ఇప్పటికీ మౌనంగా నిలిచింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ శివారులో, రమణానంద ఆశ్రమ పరిసరాల్లో ఉన్న ఈ బండరాయి ఒకప్పుడు సర్వాయి పాపన్న గౌడ్‌కు ఆశ్రయ స్థలంగా ఉపయోగపడినట్లు పెద్దలు చెబుతున్నారు.తాడిచెట్టు ఎత్తు ఉన్న ఈ భారీ బండరాయి, ఒకప్పుడు విస్తారమైన అడవిగా ఉన్న ఈ ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపుగా ఉండేదని స్థానికులు వివరిస్తున్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తన సైన్యంతో ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకునేవాడని, ఉడుంతో సహాయంతో బండరాయి పైకి ఎక్కి కొంతసేపు గడిపేవాడని పాత తరం మనుషులు ఇప్పటికీ చెప్పుకుంటున్నారు.ఇక ఈ బండరాయి నుంచి సుమారు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న పూర్ణగిరి దేవాలయం కూడా సర్వాయి పాపన్న చరిత్రతో అనుసంధానమై ఉందని కథనాలు ఉన్నాయి. వరంగల్ జిల్లా కిళాశాపురం నుంచి గోల్కొండకు గుర్రాలపై ప్రయాణించే సమయంలో, సర్వాయి పాపన్న తన సైన్యంతో కలిసి పూర్ణగిరిలోని స్వయంభు శ్రీ శ్రీ సుదర్శన లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ముందుకు సాగేవాడని పెద్దలు గుర్తుచేస్తున్నారు.

కాల ప్రవాహంలో మరుగునపడుతున్న ఈ చారిత్రక ప్రదేశాలు, సర్వాయి పాపన్న పోరాట చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తూ నేటి తరానికి తెలియాల్సిన వారసత్వంగా నిలిచాయని స్థానిక చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.

l

Sthanikam

చరిత్రలో మరుగునపడిన ‘సర్దార్ సర్వాయి పాపన్న గుండు’

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News