Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 06:39 AM

చనుబండలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ: నూతన సంవత్సరానికి ముందే లబ్ధిదారులకు ఊరట

31-12-2025 84 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఏలూరు సానికం ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో బుధవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చనుబండ పీఏసీఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.

నూతన సంవత్సరానికి ఒక రోజు ముందే, 31వ తేదీన పింఛన్లను పంపిణీ చేయించడం కూటమి ప్రభుత్వ ప్రత్యేకతగా ఆయన పేర్కొన్నారు. ఇది సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వ ఔన్నత్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు సమయానికి అందేలా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

ఈ సందర్భంగా రెండు కిడ్నీలు పాడై డయాలసిస్ చికిత్స పొందుతున్న కటకం సత్యనారాయణకు నూతనంగా మంజూరైన రూ.10,000 పింఛన్‌ను అందజేశారు. తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి ప్రభుత్వ సహాయం అండగా నిలుస్తోందని నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు చీదిరాల మారేశ్వర రావు, కందుల కృష్ణ, గుడిమళ్ల బ్రహ్మయ్య, బన్నే వెంకటేశ్వర రావు, కంచు శ్రీను, గవర వెంకటేశ్వర రావు, గవర నరసింహారావు, జోగు మహేష్, కొండా శోభన్ బాబు పాల్గొన్నారు. అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్ మురళీ మోహన్, వీఆర్ఓ శోభన్ బాబు, విస్సంపల్లి రాజా తదితరులు హాజరయ్యారు.

Sthanikam

చనుబండలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ: నూతన సంవత్సరానికి ముందే లబ్ధిదారులకు ఊరట

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News