Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 06:50 PM

చలాన్ పడితే నేరుగా ఖాతా నుంచి కట్? ఆటో డెబిట్‌పై ఆలోచన

10-02-2026 214 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తెలంగాణలో ట్రాఫిక్ నిబంధనల అమలును మరింత కఠినంగా చేపట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని పరిశీలిస్తోంది. వాహన రిజిస్ట్రేషన్ సమయంలోనే వాహనదారుల బ్యాంకు ఖాతా వివరాలను సేకరించి, ట్రాఫిక్ చలాన్ విధించినప్పుడు నేరుగా ఖాతా నుంచి జరిమానా మొత్తం కట్ అయ్యేలా ‘ఆటో డెబిట్’ వ్యవస్థను అమల్లోకి తీసుకురావాలనే ప్రతిపాదనపై చర్చ జరుగుతోంది.ఈ విధానం అమలైతే ట్రాఫిక్ చలానాల వసూలు సులభమవుతుందని, జరిమానాల పెండింగ్ సమస్య తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన వెంటనే జరిమానా ఆటోమేటిక్‌గా వసూలు కావడంతో ట్రాఫిక్ నియమాల పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.అయితే ఈ ప్రతిపాదనపై వాహనదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తమ బ్యాంకు ఖాతాలపై ప్రత్యక్ష నియంత్రణ పెరుగుతుందనే భయం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అనవసరంగా లేదా తప్పిదాల కారణంగా జరిమానాలు కట్ అయితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆందోళన కూడా ఉంది.ఇదిలా ఉండగా, రవాణా శాఖ అధికారులు ఈ అంశంపై స్పష్టత ఇస్తున్నారు. ప్రస్తుతం వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో బ్యాంకు ఖాతాలను లింక్ చేసే విధానం లేదని, ఆటో డెబిట్ విధానం కేవలం ఆలోచన దశలోనే ఉందని తెలిపారు. ప్రజల అభిప్రాయాలు, న్యాయపరమైన అంశాలు, గోప్యతా పరిరక్షణ వంటి అంశాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.

Sthanikam

చలాన్ పడితే నేరుగా ఖాతా నుంచి కట్? ఆటో డెబిట్‌పై ఆలోచన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News