Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:18 AM

చదువుతో పాటు క్రీడలు అవసరం… విద్యార్థులకు ప్రోత్సాహం అందించిన జనసేన నాయకులు తల్లాడ రామకృష్ణ.

31-12-2025 92 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చదువుతోపాటు ఆటలే విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి మార్గం

ఏలూరు స్థానికం రిపోర్టర్ గడ్డం జగన్మోహన్ రెడ్డి.

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం నరసింహారావుపాలెం పంచాయతీ సి.గుడిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆటల సౌకర్యాలు లేకపోవడంతో గ్రామ జనసేన నాయకులు తల్లాడ రామకృష్ణ ముందడుగు వేశారు. విద్యార్థులు ఆడుకునేందుకు అవసరమైన వాలీబాల్ కిట్‌ను చాట్రాయి సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డి. రామకృష్ణ చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ రామకృష్ణ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు విద్యార్థుల శారీరక, మానసిక దృఢత్వానికి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని తెలిపారు. క్రీడలకు ప్రోత్సాహం అందిస్తున్న జనసేన నాయకులు తల్లాడ రామకృష్ణను ఆయన అభినందించారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అంగిడి బక్కయ్యతో పాటు ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు. పాఠశాలలో క్రీడా వాతావరణం ఏర్పడేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.

Sthanikam

చదువుతో పాటు క్రీడలు అవసరం… విద్యార్థులకు ప్రోత్సాహం అందించిన జనసేన నాయకులు తల్లాడ రామకృష్ణ.

Article Image

చదువుతోపాటు ఆటలే విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి మార్గం

ఏలూరు స్థానికం రిపోర్టర్ గడ్డం జగన్మోహన్ రెడ్డి.

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం నరసింహారావుపాలెం పంచాయతీ సి.గుడిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆటల సౌకర్యాలు లేకపోవడంతో గ్రామ జనసేన నాయకులు తల్లాడ రామకృష్ణ ముందడుగు వేశారు. విద్యార్థులు ఆడుకునేందుకు అవసరమైన వాలీబాల్ కిట్‌ను చాట్రాయి సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డి. రామకృష్ణ చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ రామకృష్ణ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు విద్యార్థుల శారీరక, మానసిక దృఢత్వానికి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని తెలిపారు. క్రీడలకు ప్రోత్సాహం అందిస్తున్న జనసేన నాయకులు తల్లాడ రామకృష్ణను ఆయన అభినందించారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అంగిడి బక్కయ్యతో పాటు ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు. పాఠశాలలో క్రీడా వాతావరణం ఏర్పడేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News