Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 03:17 PM

చైనీస్ మాంజాపై సీపీ సజ్జనార్ కఠిన హెచ్చరికలు… విక్రయం, నిల్వకు క్రిమినల్ కేసులే

06-01-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
హైదరాబాద్ స్థానికం ప్రతినిధి

చైనీస్ మాంజా వల్ల అమాయకుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చైనీస్ మాంజా విక్రయం, నిల్వ, రవాణాపై ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ కొందరు అక్రమంగా కొనసాగిస్తుండటాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు.చైనీస్ మాంజాను విక్రయించినా, నిల్వ చేసినా సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నగరవ్యాప్తంగా షాపులు, గోదాములపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారని, ఎక్కడైనా చైనీస్ మాంజా లభిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. అక్రమంగా మాంజాను తరలించే ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.చైనీస్ మాంజాతో మెడ, గొంతు, ముఖం వద్ద తీవ్ర గాయాలు జరిగి ప్రాణాపాయం ఏర్పడే ప్రమాదం ఉందని సీపీ గుర్తు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి ప్రమాదకరమైన మాంజాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించవద్దని సూచించారు.చైనీస్ మాంజా విక్రయం లేదా వినియోగం గురించి సమాచారం ఉంటే వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని లేదా వాట్సాప్ నంబర్ 94906 16555కు ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు తెలిపారు. ప్రజల సహకారంతోనే ప్రమాదాలను అరికట్టగలమని సీపీ సజ్జనార్ పిలుపునిచ్చారు

Sthanikam

చైనీస్ మాంజాపై సీపీ సజ్జనార్ కఠిన హెచ్చరికలు… విక్రయం, నిల్వకు క్రిమినల్ కేసులే

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News