Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:36 PM

బోగారంలో చేనేత మగ్గం వద్దకు వెళ్లిన హైకోర్టు న్యాయమూర్తులు

01-02-2026 241 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మగ్గం నేసి చేనేతల నైపుణ్యాన్ని ప్రశంసించిన పి. శ్యామ్ కోషి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో నూతన కోర్టు భవనాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు పి. శ్యామ్ కోషి తో పాటు పలువురు ఉన్నత న్యాయమూర్తులు హాజరయ్యారు.శంకుస్థాపన అనంతరం రామన్నపేట మండలం బోగారం గ్రామాన్ని సందర్శించిన న్యాయమూర్తులు అక్కడి చేనేత మగ్గం నేతలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పి. శ్యామ్ కోషి స్వయంగా మగ్గం నేసి చేనేత కార్మికుల శ్రమను ప్రత్యక్షంగా అనుభవించారు. తరతరాలుగా కొనసాగుతున్న చేనేత వృత్తి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కీలకమని పేర్కొంటూ చేనేతల కళా నైపుణ్యాన్ని ప్రశంసించారు.ఈ సందర్భంగా చేనేత వృత్తిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని, సంప్రదాయ వృత్తులు నిలబెట్టుకోవాలంటే ప్రభుత్వాలు, సమాజం కలిసి ముందుకు రావాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తులు కె. శరత్, కె. లక్ష్మణ్, బి. విజయసేన రెడ్డి, వాకిటి రామకృష్ణారెడ్డి, కె. సుజన, నర్సింగరావు నందికొండ పాల్గొన్నారు. అలాగే రామన్నపేట న్యాయమూర్తులు, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ. జయరాజు హాజరయ్యారు.

Sthanikam

బోగారంలో చేనేత మగ్గం వద్దకు వెళ్లిన హైకోర్టు న్యాయమూర్తులు

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News