Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 10:01 PM

భోపాల్ వేదికగా మెరిసిన రామన్నపేట ప్రతిభ – డాక్టర్ కృష్ణ కౌండిన్యకు ‘సాహిత్యశ్రీ’ పురస్కారం

17-02-2026 101 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేటకు చెందిన ప్రముఖ కవి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్యకు ప్రతిష్టాత్మక ‘సాహిత్యశ్రీ’ పురస్కారం లభించింది. అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళన్ ఆధ్వర్యంలో భోపాల్ లో నిర్వహించిన జాతీయ సాహిత్య కార్యక్రమంలో ఈ అవార్డును ఘనంగా ప్రదానం చేశారు.

డాక్టర్ కృష్ణ కౌండిన్య గారి విశిష్ట సాహిత్య సేవలను గుర్తిస్తూ, ఆ సంస్థ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వీరేంద్ర సింగ్ చేతుల మీదుగా ‘సాహిత్యశ్రీ’ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భం సభలో చప్పట్లతో మార్మోగింది.

కార్యక్రమానికి హాజరైన డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య, కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం, అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా సాహితీ మిత్ర మండలి ప్రధాన కార్యదర్శి బాసరాజు యాదగిరి, సృజన సాహితీ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు పెరుమాళ్ళ ఆనంద్, డాక్టర్ సాగర్ల సత్తయ్యతో పాటు పలువురు కవులు, రచయితలు డాక్టర్ కౌండిన్యను అభినందించారు.

Sthanikam

భోపాల్ వేదికగా మెరిసిన రామన్నపేట ప్రతిభ – డాక్టర్ కృష్ణ కౌండిన్యకు ‘సాహిత్యశ్రీ’ పురస్కారం

Article Image

రామన్నపేటకు చెందిన ప్రముఖ కవి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్యకు ప్రతిష్టాత్మక ‘సాహిత్యశ్రీ’ పురస్కారం లభించింది. అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళన్ ఆధ్వర్యంలో భోపాల్ లో నిర్వహించిన జాతీయ సాహిత్య కార్యక్రమంలో ఈ అవార్డును ఘనంగా ప్రదానం చేశారు.

డాక్టర్ కృష్ణ కౌండిన్య గారి విశిష్ట సాహిత్య సేవలను గుర్తిస్తూ, ఆ సంస్థ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వీరేంద్ర సింగ్ చేతుల మీదుగా ‘సాహిత్యశ్రీ’ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భం సభలో చప్పట్లతో మార్మోగింది.

కార్యక్రమానికి హాజరైన డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య, కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం, అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా సాహితీ మిత్ర మండలి ప్రధాన కార్యదర్శి బాసరాజు యాదగిరి, సృజన సాహితీ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు పెరుమాళ్ళ ఆనంద్, డాక్టర్ సాగర్ల సత్తయ్యతో పాటు పలువురు కవులు, రచయితలు డాక్టర్ కౌండిన్యను అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News