Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:35 PM

భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలకు పోటెత్తిన జనసందోహం

02-02-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అభిమానుల కోలాహలం… ఏదులాపురం ఉత్సవంగా మారింది

ఒకే వేదికపై మంత్రి గారి నమ్మకస్తులు… కార్యకర్తల్లో ఉత్సాహం

ఏదులాపురం గ్రామం శనివారం రాజకీయ సందడితో దద్దరిల్లింది. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విశ్వాసపాత్రుడు, కూసుమంచి నియోజకవర్గ క్యాంప్ కార్యాలయ ఇన్‌చార్జ్ భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు పండుగను తలపించాయి. సాయి గణేష్ నగర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలిరావడంతో పరిసర ప్రాంతాలు జనసముద్రంగా మారాయి.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం క్యాంప్ కార్యాలయ ఇన్‌చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వేడుకలకు మరింత వన్నె తీసుకొచ్చారు. మంత్రి కి రెండు కళ్లలా వ్యవహరిస్తూ నియోజకవర్గ బాధ్యతలను భుజాన వేసుకున్న దయాకర్ రెడ్డి, భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిలు ఒకే వేదికపై కనిపించడంతో కార్యకర్తల్లో కొత్త జోష్ వెల్లివిరిసింది.దయాకర్ రెడ్డి చేతుల మీదుగా శ్రీనివాస్ రెడ్డి కేక్ కట్ చేయగా, ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు కేరింతలతో వేదికను మార్మోగించారు.ఈ కార్యక్రమం కేవలం జన్మదిన వేడుకగానే కాకుండా కాంగ్రెస్ శ్రేణుల బలాన్ని ప్రతిబింబించే ఆత్మీయ సమ్మేళనంగా మారింది. “పొంగులేటి ఆశయమే మన మార్గం – ప్రజల సేవయే మన లక్ష్యం” అంటూ నినాదాలు మార్మోగాయి. భారీ కేకులు, పుష్పమాలలతో అభిమానులు తమ నాయకుడిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.ఎటు చూసినా కాంగ్రెస్ జెండాలు, కార్యకర్తల కేరింతలే కనిపించాయి. సాయి గణేష్ నగర్ ప్రాంతమంతా హస్తం శ్రేణుల ఉత్సాహంతో నిండిపోయింది.ఈ వేడుకలు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలాన్ని, నాయకత్వంపై కార్యకర్తలకు ఉన్న విశ్వాసాన్ని మరోసారి స్పష్టంగా చూపించాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Sthanikam

భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలకు పోటెత్తిన జనసందోహం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News