నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ భవనంలో సోమవారం భగత్ సింగ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి, జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రభాకర్ పాల్గొని భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం భగత్ సింగ్ చేసిన త్యాగాలను, ధైర్యసాహసాలను వారు స్మరించుకున్నారు. యువత భగత్ సింగ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశం, సమాజ అభివృద్ధికి కృషి చేయాలని వారు సూచించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను నేటి తరానికి తెలియజేస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
PRINT TIME: September 28, 2026 08:56 PM
భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి:నేషనల్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర వైస్ చైర్మన్

28-09-2026
10 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ భవనంలో సోమవారం భగత్ సింగ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి, జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రభాకర్ పాల్గొని భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం భగత్ సింగ్ చేసిన త్యాగాలను, ధైర్యసాహసాలను వారు స్మరించుకున్నారు. యువత భగత్ సింగ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశం, సమాజ అభివృద్ధికి కృషి చేయాలని వారు సూచించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను నేటి తరానికి తెలియజేస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి