Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంతలతో అదుపుతప్పిన బైక్.. వ్యక్తికి తీవ్ర గాయాలు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 28, 2026 08:04 PM

యువతకు స్ఫూర్తి భగత్‌సింగ్‌ ఆశయాలు: ​బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు వీరమళ్ల కార్తీక్ గౌడ్

28-09-2026 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

దేశ స్వాతంత్ర్యం కోసం చిన్నవయసులోనే ప్రాణాలర్పించిన విప్లవ వీరుడు భగత్‌సింగ్ జీవితం నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు వీరమళ్ల కార్తీక్ గౌడ్ పేర్కొన్నారు. భగత్‌సింగ్ జయంతిని పురస్కరించుకుని సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.​ఈ సందర్భంగా కార్తీక్ గౌడ్ మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన భగత్‌సింగ్ ధైర్యం, త్యాగం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఆయన కేవలం స్వాతంత్ర్య సమరయోధుడే కాకుండా, యువతలో దేశభక్తి, సామాజిక చైతన్యం, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. నేటి యువత ఆయన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సమాజంలో ఉన్న సమస్యల పరిష్కారానికి, ప్రజా సంక్షేమానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మహనీయుల ఆశయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.​ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం నారాయణపూర్ మండల అధ్యక్షుడు కొప్పు రామకృష్ణ, నాయకులు బైకని నరేందర్, సుర్వి వెంకటేశ్, విజయ్, మురళి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

యువతకు స్ఫూర్తి భగత్‌సింగ్‌ ఆశయాలు: ​బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు వీరమళ్ల కార్తీక్ గౌడ్

Article Image

దేశ స్వాతంత్ర్యం కోసం చిన్నవయసులోనే ప్రాణాలర్పించిన విప్లవ వీరుడు భగత్‌సింగ్ జీవితం నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు వీరమళ్ల కార్తీక్ గౌడ్ పేర్కొన్నారు. భగత్‌సింగ్ జయంతిని పురస్కరించుకుని సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.​ఈ సందర్భంగా కార్తీక్ గౌడ్ మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన భగత్‌సింగ్ ధైర్యం, త్యాగం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఆయన కేవలం స్వాతంత్ర్య సమరయోధుడే కాకుండా, యువతలో దేశభక్తి, సామాజిక చైతన్యం, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. నేటి యువత ఆయన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సమాజంలో ఉన్న సమస్యల పరిష్కారానికి, ప్రజా సంక్షేమానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మహనీయుల ఆశయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.​ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం నారాయణపూర్ మండల అధ్యక్షుడు కొప్పు రామకృష్ణ, నాయకులు బైకని నరేందర్, సుర్వి వెంకటేశ్, విజయ్, మురళి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News