Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రుణాలను సద్వినియోగం చేసుకుని జీవనోపాధి పెంచుకోవాలి:ఐబీ డీపీఎం జాన్ కెనడి నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 28, 2026 06:07 PM

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీనామా చేయాలి. AILU రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి వెంకట్‌ డిమాండ్‌

28-09-2026 6 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ (AILU) ఆధ్వర్యంలో శనివారం రామన్నపేట కోర్టు ఎదుట నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా AILU తెలంగాణ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు మామిడి వెంకట్‌ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషనర్‌ వ్యవహారశైలి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని విమర్శించారు. ఇతర ఎన్నికల కమిషనర్ల భిన్నాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని కాపాడేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ స్వతంత్రంగా, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

భారత రాజ్యాంగం కల్పించిన సార్వత్రిక వయోజన ఓటు హక్కును, ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని, లేనిపక్షంలో రాజ్యాంగబద్ధమైన పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా ఆయనను తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్‌తో జరుగుతున్న ప్రజా ఆందోళనలకు AILU సంఘీభావం ప్రకటిస్తుందని తెలిపారు.

కార్యక్రమంలో AILU జిల్లా కమిటీ సభ్యులు ఎండీ ఖయ్యూం, గడ్డం నరసింహ, శ్రీకాంత్‌, శ్రీశైలం, తాటిపాముల కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీనామా చేయాలి. AILU రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి వెంకట్‌ డిమాండ్‌

Article Image

రామన్నపేట: ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ (AILU) ఆధ్వర్యంలో శనివారం రామన్నపేట కోర్టు ఎదుట నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా AILU తెలంగాణ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు మామిడి వెంకట్‌ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషనర్‌ వ్యవహారశైలి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని విమర్శించారు. ఇతర ఎన్నికల కమిషనర్ల భిన్నాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని కాపాడేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ స్వతంత్రంగా, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

భారత రాజ్యాంగం కల్పించిన సార్వత్రిక వయోజన ఓటు హక్కును, ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని, లేనిపక్షంలో రాజ్యాంగబద్ధమైన పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా ఆయనను తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్‌తో జరుగుతున్న ప్రజా ఆందోళనలకు AILU సంఘీభావం ప్రకటిస్తుందని తెలిపారు.

కార్యక్రమంలో AILU జిల్లా కమిటీ సభ్యులు ఎండీ ఖయ్యూం, గడ్డం నరసింహ, శ్రీకాంత్‌, శ్రీశైలం, తాటిపాముల కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News