Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పత్తి కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి:అదనపు కలెక్టర్ సంగీత నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 28, 2026 07:02 PM

రుణాలను సద్వినియోగం చేసుకుని జీవనోపాధి పెంచుకోవాలి:ఐబీ డీపీఎం జాన్ కెనడి

28-09-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఆందోల్ మండలం పరిధిలోని నేరేడుగుంట గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలమూరు మండల సమాఖ్య సీఆర్పీ లు ట్రైనర్లు స్వప్న, వసంత మాట్లాడుతూ మహిళలు క్రమం తప్పకుండా పొదుపు చేస్తూ ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల నిర్వహణ, బ్యాంకు రుణాలను సక్రమంగా వినియోగించుకోవడం, రుణాల ద్వారా ఆదాయం పెంచే జీవనోపాధి అవకాశాలను ఎంచుకోవడం వంటి అంశాలపై మహిళలకు అవగాహన కల్పించారు. మహిళా సంఘాలు పేదరిక నిర్మూలనతో పాటు కుటుంబాల ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ప్రతి మహిళ అందుబాటులో ఉన్న రుణాలను సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలను పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐబీ డీపీఎం జాన్ కెనడీ, ఐబీ ఏపీఎం శివకుమార్ పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలతో పాటు గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో అందోల్ మండల ఏపీఎం దేవేందర్, సీసీ మల్లేశం, వీఓఏలు అశోక్, సునీత, గ్రామ మహిళా సంఘాల అధ్యక్షురాలు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రుణాలను సద్వినియోగం చేసుకుని జీవనోపాధి పెంచుకోవాలి:ఐబీ డీపీఎం జాన్ కెనడి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News