Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మునగాల ప్రజావాణికి 6 దరఖాస్తులు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 28, 2026 08:50 PM

గుంతలతో అదుపుతప్పిన బైక్.. వ్యక్తికి తీవ్ర గాయాలు

28-09-2026 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కంగ్టి మండల పరిధిలోని చప్తా-కే గ్రామ శివారులో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్రం ఔరాద్‌కు చెందిన హనుమంతు తన వ్యక్తిగత పనిమీద పిట్లం వైపు బైక్‌పై వెళ్తుండగా, రహదారిపై ఉన్న గుంతల కారణంగా బైక్ అదుపుతప్పి కిందపడిపోయినట్లు సమాచారం.ఈ ప్రమాదంలో హనుమంతుకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని హనుమంతును అంబులెన్స్‌లో కంగ్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు సొంత వాహనంలో బీదర్‌కు తీసుకెళ్లినట్లు తెలిసింది.రహదారిపై ప్రమాదకరంగా ఉన్న గుంతల కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి గుంతలను పూడ్చి రహదారిపై ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Sthanikam

గుంతలతో అదుపుతప్పిన బైక్.. వ్యక్తికి తీవ్ర గాయాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News