ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.అర్హులైన ఓటర్ల పేర్ల తొలగింపుపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోందని, ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో నిరసనలు చేపడుతూ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. ప్రజల ఓటు హక్కు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పార్లమెంట్‌లోనూ, బయటా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల జాబితాలపై వస్తున్న అభ్యంతరాలకు ఎన్నికల సంఘం పారదర్శకంగా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన అర్హులైన ఓటర్ల హక్కులను కాపాడేందుకు నిరంతరం పోరాడుతామని అన్నారు. ఓటు హక్కు పరిరక్షణ, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవ్ రెడ్డి, మెదక్ పార్లమెంట్ ఇన్‌చార్జ్ నీలం మధు, టీజేఏసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, గ్రంథాలయ చైర్మన్, మున్సిపల్, మండల అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, మహిళా కాంగ్రెస్ నాయకులు, దిశ కమిటీ జిల్లా సభ్యులు ప్రకాష్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ పోరాటం: ఎంపీ షేట్కార్

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి