నారాయణఖేడ్ మున్సిపాలిటీలో అర్హులైన ముస్లిం మైనార్టీ మహిళలకు ఇటీవల కుట్టు మిషన్లు పంపిణీ చేసినప్పటికీ, 14వ వార్డుకు చెందిన నస్రీన్ బేగం పేరు అర్హత జాబితాలో ఉన్నా ఆమెకు మిషన్ అందలేదని బిఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. అధికారులు ఫోన్ చేసి పంపిణీ కేంద్రానికి రావాలని చెప్పడంతో అక్కడికి వెళ్లిన తన నుంచి ఆధార్ వివరాలు, సంతకం తీసుకుని, మిషన్లు అయిపోయాయని చెప్పి పంపించారని నస్రీన్ బేగం ఆరోపించినట్లు నాయకులు తెలిపారు. గతంలో బిఆర్ఎస్‌కు మద్దతుగా నిలిచినందువల్లే మిషన్ ఇవ్వలేదని అక్కడ చెప్పినట్లు ఆమె పేర్కొన్నారని తెలిపారు.ఈ ఘటనపై బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై, స్థానిక ఎమ్మెల్యేపై ప్రశ్నలు సంధించారు. సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలకు అందించాలని, పార్టీ అనుబంధం ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయడం సరికాదని అన్నారు. కుట్టు మిషన్ల పంపిణీకి సంబంధించిన పూర్తి లబ్ధిదారుల జాబితాను ప్రజల ముందు ఉంచాలని, నస్రీన్ బేగం విషయంలో జరిగిన అంశంపై అధికారులు సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. అర్హత ఉన్న ప్రతి మహిళకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నజీబ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు నగేష్ సెట్, మాజీ ఎంపీటీసీ ముజామిల్, మాజీ కౌన్సిల్ సభ్యుడు ఉబేద్, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కుట్టు మిషన్ల పంపిణీపై సమగ్ర విచారణ జరపాలి:బిఆర్ఎస్ డిమాండ్

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి