Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పత్తి కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి:అదనపు కలెక్టర్ సంగీత నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 28, 2026 07:07 PM

గొర్రెల మార్కెట్ యార్డ్‌ను వెంటనే ప్రారంభించాలి

28-09-2026 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

‘ప్రజావాణి’లో జిల్లా అధికారులకు జిఎంపిఎస్ వినతి

రూ. 50 లక్షలతో నిర్మించినా ఊపయోగంలోకి రాని వైనం

చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో కోట్ల విలువైన ఆస్తులు వృథాగా మారుతున్నాయని, రూర్బన్ మిషన్ ద్వారా నిర్మించిన గొర్రెల మార్కెట్ యార్డ్‌ను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం మండల కమిటీ డిమాండ్ చేసింది. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి నాగిరెడ్డికి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.​ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల పోరాటాల ఫలితంగా 2024లో రూర్బన్ మిషన్ కింద రూ. 50 లక్షల వ్యయంతో ఈ గొర్రెల మార్కెట్ యార్డ్‌ను నిర్మించినట్లు తెలిపారు. నిర్మాణం పూర్తయినా అధికారులు దీనిని వినియోగంలోకి తీసుకురాకపోవడంతో ప్రస్తుతం నిరుపయోగంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా జీవాల తాగునీటి కోసం వేసిన బోరు మోటార్‌ను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారని, అలాగే తాగునీటి నల్లాలను పూర్తిగా ధ్వంసం చేశారని ఆరోపించారు.​వెంటనే స్పందించి మార్కెట్ యార్డ్‌లో మౌలిక వసతులు పునరుద్ధరించి, పెంపకందారులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ జిల్లా డైరెక్టర్ బండారు నరసింహ, జిల్లా కార్యదర్శి దయ్యాల నరసింహ, నాయకులు అవిశెట్టి పాండు, పాక జహంగీర్, చౌటుప్పల్ మండల కార్యదర్శి కొండే శ్రీశైలం, మున్సిపల్ కన్వీనర్ గుణమోని ఐలయ్య, మండల ఉపాధ్యక్షులు గజ్జి పాండు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గొర్రెల మార్కెట్ యార్డ్‌ను వెంటనే ప్రారంభించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News