రామన్నపేట సెప్టెంబర్ 28 స్థానికం ప్రతినిధి:
విద్యార్థుల్లోని ప్రతిభను ప్రోత్సహిస్తూ వారికి అండగా నిలుస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య రాహత్ ఖానం ప్రోత్సాహంతో కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి రీల్ మేకింగ్ పోటీల్లో బీఎస్సీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని పి. భానుశ్రీ, బీఏ ద్వితీయ సంవత్సరం విద్యార్థి వి. చందు బహుమతులు సాధించారు.
హైదరాబాద్‌లోని శిల్పకళారామంలో జరిగిన కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా విద్యార్థులు పురస్కారాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు కళాశాల తరఫున నిరంతరం ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థులు ప్రతిభ చాటడం కళాశాలకు గర్వకారణమన్నారు.
కళాశాల యువ టూరిజం క్లబ్ కోఆర్డినేటర్ డాక్టర్ డి. కిషన్ మాట్లాడుతూ.. కళాశాల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు విద్యార్థులు చూపిన ప్రతిభ ఫలితంగానే ఈ విజయాలు దక్కాయని తెలిపారు. విజేతలను అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు అభినందించారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి