Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంతలతో అదుపుతప్పిన బైక్.. వ్యక్తికి తీవ్ర గాయాలు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 28, 2026 08:04 PM

పత్తి కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి:అదనపు కలెక్టర్ సంగీత

28-09-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లాలో వానాకాలం 2026–27 సీజన్‌ పత్తి కొనుగోళ్లను రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సంగీత ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో అధికారులు, జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఈ సీజన్‌లో 3,57,246 ఎకరాల్లో పత్తి సాగు కాగా, సుమారు 3,16,520 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసిందన్నారు. పత్తి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,667గా నిర్ణయించబడిందని, రైతుల నుంచి ఎంఎస్‌పీతో పత్తి కొనుగోలులో సీసీఐ కీలకంగా వ్యవహరిస్తుందని తెలిపారు.అక్టోబర్ 1 నుంచి కొనుగోళ్లు ప్రారంభించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, అధీకృత జిన్నింగ్ మిల్లులను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో వేబ్రిడ్జ్‌లు, సీసీ కెమెరాలు, వేలిముద్ర స్కానర్లు, ఇంటర్నెట్, అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసి తూకాల్లో ఎలాంటి తేడాలు లేకుండా చూడాలని ఆదేశించారు. రైతులు కాపాస్ కిసాన్ యాప్‌లో నమోదు చేసుకుని స్లాట్ బుకింగ్ చేసుకునేలా, పత్తి నాణ్యత, తేమ శాతం తదితర అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో సదాశివపేట, రైకోడ్, నారాయణఖేడ్, జోగిపేట, వట్‌పల్లి, జహీరాబాద్‌లలో ఆరు కాటన్ ఏఎంసీలు ఉండగా, ఈ సీజన్‌లో 23 జిన్నింగ్ మిల్లులను ప్రతిపాదించినట్లు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి శ్రీకాంత్ తెలిపారు. రైతుల సాగు, ఉత్పత్తి వివరాలను సెప్టెంబర్ 30లోగా కాపాస్ కిసాన్ యాప్‌లో నమోదు చేయాలని, ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమం ద్వారా స్లాట్ బుకింగ్, కొనుగోలు కేంద్రాల వివరాలను రైతులకు తెలియజేయాలని సూచించారు. పత్తి కొనుగోళ్లు సజావుగా జరిగేలా సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ సంగీత ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్, సంబంధిత శాఖల అధికారులు, జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

పత్తి కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి:అదనపు కలెక్టర్ సంగీత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News