మంచినీటి పైపులైన్ పనులకు శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి
పార్టీలకు అతీతంగా పట్టణంలోని ప్రతి వార్డును అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి అన్నారు. సోమవారం పట్టణంలోని 8వ వార్డు కుసుమవారిగూడెంలో మంచినీటి పైపులైన్ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 8వ వార్డులో నెలకొన్న మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు పైపులైన్ పనులు చేపట్టినట్లు తెలిపారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో మంచినీటి సమస్యలు లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కార్యక్రమంలో కౌన్సిలర్ పోతురాజు ఇందుశ్రీ అనిల్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, డీఈ ప్రణయ్‌రెడ్డి, ఏఈ తిరుమలయ్య, వాటర్ సప్లై సూపర్‌వైజర్ సమ్మీ, వార్డు ఆఫీసర్ యశ్వంత్, జవాన్ తండు ఉపేందర్, టెక్నికల్ వర్కర్లు సాయికుమార్, పవన్‌కుమార్, లైన్మెన్ వెంకన్న, కొరివి నాగయ్య, వెంకన్న, జూలకంటి నాగేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి